మహేష్ బాబు సినిమా అప్ డేట్స్ ఆయన పీఆర్ టీమ్ కన్నా ముందే ఫ్యాన్స్ పసిగడుతున్నారు. పైగా మహేష్ బాబుకు, నమ్రతకు, నిర్మాతలకు అఫీషియల్ గా, అనఫీషియల్ గు అనేక పీఆర్ టీమ్ లు వున్నాయి. కానీ ఫ్యాన్స్ ఆక్టివిటీ అంత ఫాస్ట్ గా వుంటోంది మరి. లేటెస్ట్ గా ఫ్యాన్స్ తన హీరో సర్కారువారి పాట సినిమాలోకి తమిళ హీరో అరవింద్ స్వామి ని తీసుకు వచ్చారు. ఇప్పటి వరకు సినిమాలో బ్యాంక్ లోన్ ఎగ్గొట్టిన విలన్ గా ఉపేంద్ర పేరు వినిపించింది.
మరి ఈ క్యారెక్టర్ కో, లేదా మరే క్యారెక్టర్ కో అరవింద్ స్వామిని తీసుకుంటున్నారంటూ ట్విట్టర్ లో ఫ్యాన్స్ సందడి ప్రారంభమైంది. దీంతో మహేష్ సినిమాలో అరవింద్ స్వామి అనే వార్త వెబ్ మీడియాలోకి దూసుకువచ్చేసింది. ఇదే వార్త నిజమైతే మాత్రం మంచి కాంబినేషన్ అవుతుంది. ధృవ సినిమాతో తెలుగు నాట అరవింద్ స్వామి మాంచి మార్కులు, ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
రొటీన్ విలనిజానికి బదులు, పాలిష్డ్ విలనిజం చూపించి ఆకట్టుకున్న అరవింద్ స్వామి తమ హీరో సినిమాలోకి వస్తున్నాడన్న వార్తలు మహేష్ ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తున్నాయి.