Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అరవింద లండన్ షెడ్యూల్ క్యాన్సిల్?

అరవింద లండన్ షెడ్యూల్ క్యాన్సిల్?

కాలంవెనుక పరుగెడుతోంది అరవింద సమేత వీరరాఘవ యూనిట్. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారిక హాసిని సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా  విడుదల డేట్ దగ్గరకు వస్తోంది. వర్క్ చూస్తే చాలావుంది. డే అండ్ లేట్ హవర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే సండేలు షెడ్యూళ్లు వేస్తున్నారు. అయినా ఇంకా పనివుంది. అందుకే రెండుపాటల చిత్రీకరణ కోసం అనుకున్న లండన్ షెడ్యూలును క్యాన్సిల్ కొట్టేసారు.

లోకల్ గానే పాటలు షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒకపాటను కొచ్చిన్ లేదా మహా బలేశ్వర్ లో కానీ, మరోపాటను లోకల్ గా సెట్ వేసి చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ కొచ్చిన్ పరిస్థితి అంత బాగాలేదు కనుక, మహాబలేశ్వర్ ను ఫైనల్ చేసే అవకాశం వుంది. లేదా వేరే లోకేషన్ సీన్లోకి వచ్చినా ఆశ్చర్యంలేదు.

ప్రస్తుతం ఆర్ ఎఫ్ సిలో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా మరో రెండురోజుల్లో హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. అరవింద సమేత వీరరాఘవ అక్టోబర్ 11 విడుదల లక్ష్యంగా ముస్తాబవుతోంది. ఇంకా నెలరోజుల వరకు షూట్ వర్క్ వుందని అంచనా. యూరప్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసి, లోకల్ గా ఏర్పాటు చేయడం వల్ల టైమ్ చాలా కలిసివచ్చిందని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?