అరవింద.. ఆకుల కోసం పాతికలక్షలు

మొక్కే కదా అని తీసి పారేస్తే… అన్నది మెగాస్టార్ పాపులర్ డైలాగు. సినిమాల్లో అంతే, ఒక్కేసారి మొక్కలకు, ఆకులకు కూడా లక్షలు ఖర్చుచేయాల్సి వస్తుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఓ వ్యవహారం ఇలాంటిదే. ఆ సినిమాలో…

మొక్కే కదా అని తీసి పారేస్తే… అన్నది మెగాస్టార్ పాపులర్ డైలాగు. సినిమాల్లో అంతే, ఒక్కేసారి మొక్కలకు, ఆకులకు కూడా లక్షలు ఖర్చుచేయాల్సి వస్తుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఓ వ్యవహారం ఇలాంటిదే. ఆ సినిమాలో జస్ట్ ఆకుల కోసం పాతికలక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

విషయం ఏమిటంటే, అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఓ సీన్ వుందట. ఆ సీన్ లో రెండు చెట్లు కనిపిస్తాయి. ఒకటి ఎండిపోయినది, ఒకటి నిండుగా ఆకులతో వున్నది. ఈ సీన్ మరి పాటలో వస్తుందో? మామూలుగా వస్తుందో తెలియదు. కానీ ఆర్టిఫిషియల్ గా చెట్లు ఏర్పాటు చేయక తప్పలేదట. అందుకోసం భారీ సంఖ్యలో ప్లాస్టిక్ ఆకులు చెన్నయ్ నుంచి తెప్పించారట.

అందుకోసం దాదాపు పాతిక లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. తీరాచేసి అంతా సెట్ చేస్తే, గట్టిగా గాలి వీయడం, ఆకులు రాలిపోవడం, మళ్లీ అతికించడం లాంటి పాట్లు తప్పలేదట. ఇలా ఆకులు రాలడం అంటే త్రివిక్రమ్ అత్తారింటికి దారేదిలో చేసిన బ్రహ్మీ కామెడీ ట్రాక్ గుర్తుకువస్తుంది. కొంపదీసి ఆ సెంటిమెంట్ తో కానీ త్రివిక్రమ్ ఈ ఆకులు, చెట్టు కాన్సెప్ట్ పెట్టుకోలేదు కదా? సినిమా చూస్తే కానీ క్లారిటీరాదు.