అసలు కీరవాణికి ఏమయ్యింది.!

ఆయనో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు. 'బాహుబలి' సినిమాకి పనిచేసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశారు. పైగా, ఆయన అందరివాడు. కానీ, ఈ మధ్యనే ఆయన 'కొందరివాడు' అయిపోయాడు. కారణం,…

ఆయనో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు. 'బాహుబలి' సినిమాకి పనిచేసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశారు. పైగా, ఆయన అందరివాడు. కానీ, ఈ మధ్యనే ఆయన 'కొందరివాడు' అయిపోయాడు. కారణం, ఆయనగారి ట్విట్టర్‌ పిట్టే.! ఆయనే కీరవాణి.

సరదాగా ట్విట్టర్‌ అక్కౌంట్‌ ఓపెన్‌ చేసి, అందులో కొన్ని వివాదాస్పద కామెంట్స్‌ పెట్టేయడంతో రచ్చ మొదలైంది. 'బ్రెయిన్‌లెస్‌..' అంటూ తెలుగు సినీ పరిశ్రమలో పలువురి (పేర్లు చెప్పలేదులెండి..)పై దుమ్మెత్తిపోసేశారు కీరవాణి. ఇదంతా 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామం. 

'కీరవాణి ఏంటి.? ఇంతలా ట్విట్టర్‌లో విరుచుకుపడ్డమేంటి.?' అని అంతా ఆశ్చర్యపోయారు. చిత్రంగా, ఇప్పుడాయన తాను వేసిన ట్వీట్లను తొలగించారట. కొందరు చేసిన బ్రెయిన్‌ వాష్‌తో కీరవాణి ఆ పని చేశారట. ఆయనే చెప్పుకున్నారు ఆ మాట. పైగా, తనను తాను 'బ్రెయిన్‌లెస్‌'గా అభివర్ణించేసుకున్నారు కీరవాణి. ఇదీ సెటైరే లెండి. అసలు కీరవాణికి ఏమయ్యింది.? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు. 

వివాదాస్పద కామెంట్లు చేసి పబ్లిసిటీ పొందాల్సిన 'ఖర్మ' అయితే కీరవాణికి లేదు. మరెందుకు కీరవాణి ఇలా చేశారట.? ఎంత బుర్రగోక్కున్నా.. కీరవాణిని ఈ కోణంలో ఎవరూ చూడలేకపోతున్నారంతే. కానీ, కీరవాణి మారారు.. చాలా చాలా మారారు. అవును, ఆయన మారిపోయారు. పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారో, ఇంకేదన్నా ఆలోచనలు ఆయన మెదడులో తొలిచేస్తోందోగానీ, ఈయన అందరికీ తెలిసిన కీరవాణి మాత్రం కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.