లాంటి వారైనా హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు సలాం కొట్టవలసిందే. అందులోనూ సాయంత్రం వేళల్లో ఐ టి ఏరియా అయిన మాదాపూర్ పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ కు దడుసుకోవాల్సిందే. ఈసారి ఈ ట్రాఫిక్ హీరో కార్తీకి కూడా అనుభవంలోకి వచ్చింది. ప్రస్తుతం కార్తీ తన లేటెస్ట్ సినిమా చినబాబు ప్రమోషన్ల కోసం తెలంగాణలో తిరుగుతున్నారు.
ఇలా తిరుగుతూ ఈ సాయంత్రం మాదాపూర్ ప్రాంతానికి వచ్చారు. ఆయన అక్కడి నుంచి తిన్నగా జూబ్లి హిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్ కు వెళ్లాల్సి వుంది. అక్కడ చినబాబు సక్సెస్ మీట్ లో పాల్గొనాల్సి వుంది. అయితే ట్రాఫిక్ లో ఇరుక్కున్న కార్తీ చాలే టైమ్ వృధాగా పోవడం గమనించి, ఆఖరికి కారు, డ్రయివర్ ను అక్కడే వదిలేసారు.
నిర్మాత రవీందర్ రెడ్డి తో కలిసి ఓ ఆటో పట్టుకుని, చకచకా ట్రాఫిక్ ను దాటుకుని, ఫ్రసాద్ ల్యాబ్ కు చేరుకుని, కార్యక్రమంలో పాల్గొన్నారు. మాదాపూర్, కూకట్ పల్లి ఏరియాల్లో సాయంత్రం వేళ ట్రాఫిక్ చాలా బీభత్సంగా వుంటుంది. మెట్రో వచ్చిన తరువాత బాధలు తగ్గకపోగా, యు టర్న్ ల పుణ్యమా అని ఎక్కవ అయ్యాయి. సిగ్నల్స్ తీసేయడంతో ఎక్కడా పోలీసుల జాడే కనిపించడం లేదు.
మొత్తం మీద కార్తీ ఆటో ఎక్కిన పుణ్యమా అని మళ్లీ హైదరాబాద్ ట్రాఫిక్ మీద కాస్త చర్చ జరుగుతుందేమో?