హీరోలకు రెమ్యూనిరేషన్ గా కోట్లకు కోట్లు ఇవ్వడం కొత్తేమీ కాదు. మిడిల్ రేంజ్ యంగ్ హీరోలకు కోటి నుంచి మూడు కోట్లు ఇవ్వడం అన్నదీ పాయింట్ కాదు. అయితే రోజులు లెక్కన పేమెంట్లు చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కోట్లు పే చేయడం అంటే కాస్త వార్తే. జగపతిబాబు లాంటి వాళ్లకి మాత్రమే ఈ రేంజ్ పేమెంట్లు జరుగుతున్నాయి.
ఇప్పుడు ఈ జాబితాలో అవసరాల శ్రీనివాస్ కూడా చేరినట్లు ఇండస్ట్రీ టాక్. అవసరాల హీరోగా ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డైరక్టర్ గా స్థిరపడ్డారు. సో, డైరక్టర్ గా కోట్లలో రెమ్యూని రేషన్ తీసుకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా లక్షల్లోనే వుంటుంది. అలాంటిది ఇప్పుడు చేస్తున్న బాబు బాగా బిజీ సినిమాకు రెండు కోట్ల రెమ్యూనిరేషన్ అందినట్లు ఇండస్ట్రీ టాక్.
ఈ సినిమాలో అవసరాల హీరోనే. అందుకే ఆ రేంజ్ రెమ్యూనిరేషన్ అనుకోవడానికీ వీలు లేదు. హీరోగా చూసుకున్నా, అవసరాలకు మంచి పారితోషికం, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువ పారితోషికం ముట్టినట్లే అనుకోవాలి. హంటర్ లాంటి సబ్జెక్ట్ లో నటించడానికి ఓకె చెప్పడం కోసమే నిర్మాతలు ఇంత పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే హంటర్ కాస్త థర్డ్ గ్రేడ్ బూతు సినిమా అనే టాక్ వుంది. మరి ఇప్పుడు ఆ సినిమా అవసరాల స్టయిల్ లోకి ఎలా రొమాంటిక్ ఫన్ ఎంటర్ టైనర్ గా మారుతుందో చూడాలి.