Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అవిక గోర్ పై అనేక అనుమానాలు

అవిక గోర్ పై అనేక అనుమానాలు

అవిక గౌర్ ఒక్కసారిగా సినిమాలకు గుడ్ బై చెప్పి, సైలెంట్ గా, ఒంటరి జీవితం గడుపుతోందని వెల్లడించిన వార్త సృష్టించిన సంచలనం ఇంతా కాదు. ఈ వార్తను దాదాపు ప్రతి మీడియా ఫాలో అయి, తన పాఠకులకు అందించే ప్రయత్నం చేసింది. అయితే ఈ వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో టాలీవుడ్ లో కొత్త గుసగుసలు వినిపించడం ప్రారంభమైంది. ఈ గుసగుసలు వాస్తవానికి నమ్మదగ్గవిగా లేవు. కానీ టాలీవుడ్ లోని నమ్మదగ్గ సర్కిళ్లలో ఈ గుసగుసలు వినిపించడంతో ఏది నిజమో, ఏది కాదో ఆలోచించాల్సి వస్తోంది.

అందులో కీలకమైనది అవిక గౌర్ కాస్త అనారోగ్యంతో బాధపడుతోందన్నది ప్రధానంగా వినిపిస్తున్న గుసగుస. కొద్ది రోజుల క్రితం నుంచి అవిక ఓ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతోందని, దానికి ట్రీట్ మెంట్ తీసుకోవడం కోసమే ఆమె ప్రస్తుతం ఏ సినిమాలు ఒప్పుకోలేదని ఓ గుసగుస వినిపిస్తోంది. ఈ విషయం ఇండస్ట్రీలో ఆమెతో నటించిన హీరోలకు ఇప్పటికే తెలుసు అన్న టాక్ వినిపిస్తోంది. 

మరోపక్క ఇదంతా వదంతి అని, అవిక తనకు నచ్చిన వ్యక్తితో డేటింగ్ లో వుందని, అందుకే ఆమెకు సినిమాల మీద పెద్దగా దృష్టి లేదని ఇంకో టాక్ వినిపిస్తోంది. అయితే మొత్తం మీద అవిక తల్లితండ్రులకు దూరంగా వుంటోందన్నది వాస్తవమే అని, ఒక దశలో ఒకప్పుడు ఆమె తన తల్లి తండ్రులపైనే ఫిర్యాదు చేసేందుకు రెడీ అయిందని తెలుస్తోంది. మొత్తం మీద అవిక వ్యవహారం పై వెల్లడించిన వార్త కాస్త గట్టి ప్రకంపనలే సృష్టించింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?