మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ చేయబోయేది, కొరటాల శివ దర్శకత్వంలోనే. త్వరలోనే ఆ సినిమా ప్రారంభోత్సవం జరిపేందుకు మహేష్‌బాబు 'తొందర'పడుతున్నాడట. కథ రెడీగా వుంది గనుక, మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే.. సినిమాని పట్టాలెక్కించేయడానికి కొరటాల రెడీగానే వున్నాడు.
కానీ, ఇక్కడే పెద్ద చిక్కు వుంది. అదేంటంటే, ముందుగా మహేష్ కాస్త వెసులుబాటు చూసుకోవాలి. ఎందుకంటే, మురుగదాస్‌తో సినిమా అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పెర్‌ఫెక్షన్ విషయంలో మురుగదాస్ రాజీపడడు. సినిమా నిర్మాణం స్పీడ్‌గా జరగదు. జాగ్రత్తగా సినిమాని తెరకెక్కిస్తాడు. సో, మహేష్ వీలైనంత ఎక్కువ సమయం మురుగదాస్ కోసం కేటాయించాల్సిందే.
ఇదిలా వుంటే, మురుగదాస్ సినిమా రిలీజయిన తర్వాత మూడు నుంచి నాలుగు నెలల తేడాలోనే కొరటాల శివతో చేసే సినిమా రిలీజ్ చెయ్యాలన్నది మహేష్ ప్లానింగ్ అట. ఈ తొందర వెనుక కారణమేంటన్నది తెలియడంలేదు. మహేష్ మాత్రం, ఈ విషయంలో చాలా పట్టుదలగా వున్నాడని తెలుస్తోంది. మురుగదాస్ సినిమా అనుకున్నాక, అది పట్టాలెక్కడానికి చాలా టైమ్ పట్టేసింది. ఆ గ్యాప్‌ని ఇలా మహేష్ కాంపన్సేట్ చేయాలనుకుంటున్నాడా.? ఇంకేమన్నా కారణాలున్నాయా.?