అ! మరి కొంచెం క్యూరియాసిటీ

నాని నిర్మాతగా మారి, ఆపై సినిమాలో చేపగా మారి, బోలెడు మంది నటీనటులను సినిమాలోకి తీసుకువచ్చి, అందిస్తున్న ప్రోడక్ట్ అ!. ఈ సినిమా ఓ వైవిధ్యమైన థ్రిల్లర్ అని ఆది నుంచీ ప్రొజెక్ట్ చేస్తూనే…

నాని నిర్మాతగా మారి, ఆపై సినిమాలో చేపగా మారి, బోలెడు మంది నటీనటులను సినిమాలోకి తీసుకువచ్చి, అందిస్తున్న ప్రోడక్ట్ అ!. ఈ సినిమా ఓ వైవిధ్యమైన థ్రిల్లర్ అని ఆది నుంచీ ప్రొజెక్ట్ చేస్తూనే వచ్చారు. ముందుగా ఒక్కో యాక్టర్ గెటప్ రివీల్ చేసుకుంటూవచ్చారు. దాంతో కొంత ఆసక్తి కలిగింది.

ఆపై టీజర్ విడుదల చేసారు. ఆ ఆసక్తి మరి కాస్త పెరిగింది. ఇప్పుడు ట్రయిలర్ విడుదల చేసారు. నిజానికి ట్రయిలర్ లో కొత్తగా చెప్పిన దాని కన్నా, చెప్పకుండా దాచిందే ఎక్కువ వుంది. గుప్పిట విప్పడానికి ఒక్కో వేలు విప్పుతున్న చందంగా వుంది. కానీ ట్రయిలర్ తో కూడా పూర్తిగా గుప్పిట తెరుచుకోలేదు. ఇంకా లోపల ఏదో వుందన్న ఆసక్తిని మాత్రం మరి కాస్త పెంచింది.

థ్రిల్లర్ గా కథ, కథనాలు ఆకట్టుకునేలా వుంటే మాత్రం అ! సినిమా ష్యూర్ షాట్ అవుతుంది. కానీ వాటి కన్నా ఎక్కువగా ఈ గెటప్ ల మీద, వైవిధ్యం మీద దృష్టి పెడితే మాత్రం, రెగ్యులర్ ఆడియన్స్ కు దూరంగా వుంటుంది. అయితే నాని అంత సాహసం చేస్తున్నట్లు లేదు. కాస్త ఫాంటసీ టచ్ వున్న థ్రిల్లర్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.