అశ్వనీదత్.. ఒకప్పుడు భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి మాంచి, బడా నిర్మాతను తన ఒకే ఒక్క సినిమాతో మూలకు నెట్టాడు డైరక్టర్ మెహర్ రమేష్. ఆయన తను తీసిన శక్తి సినిమాతో మొత్తం నిర్మాత శక్తి మొత్తం హరించుకుపోయేలా చేసాడు.
మెల్లగా మళ్లీ ఓ మాంచి కాంబినేషన్ సినిమాలు రెండు సెట్ చేసుకున్నారు. అందులో ఒకటి నాని-నాగ్ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరక్షన్ సినిమా ఒకటి. మహేష్ తో సినిమా వుంది కానీ, అది టైమ్ పడుతుంది. నాగ్–నాని సినిమా చకచకా రెడీ అవుతోంది.
అయితే ఈలోగా ఏం జరిగింది. హీరో నాని మరోసారి హీరోయిజం, మాస్ యాక్షన్ కోసం ట్రయ్ చేసి దెబ్బతిన్నారు. మరోపక్క నాగ్ లేటెస్ట్ మూవీ ఆఫీసర్ సినిమా అలా పడి వుంది. దాన్ని కొనేవారు కనిపించడం లేదని వినికిడి. మరో పక్క ఆ సినిమా నిర్మాత, దర్శకుడు ఆర్జీవీ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు.
ఇలా తన కాంబినేషన్ హీరోలు ఇద్దరు డౌన్ స్టేజ్ లో వున్నారు. పైగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇప్పటి వరకు పెద్ద కమర్షియల్ సక్సెస్ లు ఇచ్చింది లేదు. భలే మంచి రోజు నిర్మాతలకు లాభాలేమీ తెచ్చింది లేదు. శమంతకమణి పరిస్థితి అంతే. మరి అలాంటి డైరక్టర్, ఇలాంటి హీరోల కాంబినేషన్.. అశ్వనీదత్ ఈ సినిమాను బడ్జెట్ మేరకు మార్కెట్ చేయడం కాస్త కష్టమే.