సినిమా మొదలయ్యే వేళ ఎంత ఫ్రెండ్లీగా వుంటారో…సినిమా ముగిసేసరికి అంత వైరం వచ్చేస్తోంది ఈ మధ్య హీరోలకు..దర్శకులకు. ఖిలాడీ..ధమాకా సినిమాల టైమ్ లో హీరో రవితేజ విషయంలో ఇలాంటి గ్యాసిప్ లు వినిపించాయి.
ఇప్పుడు మరో హీరో వంతు వచ్చింది. సరైన హిట్ కోసం చూస్తున్నారు ఈ హీరో. ఆ మధ్య కాస్త పేరున్న దర్శకుడితో ట్రయ్ చేసారు కానీ మంచి రోజులు రాలేదు. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. విడుదల దగ్గరకు వస్తోంది.
కానీ ఇప్పుడు డైరక్టర్ కు హీరోకి ఉప్పు నిప్పులా వుంది పరిస్థితి అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు ఖర్చు తడిసి మోపెడయింది. కౌన్సిల్ సమావేశాల్లో ఖర్చులు ఎలా తగ్గించాలి. సినిమాను బడ్జెట్ లో ఎలా తీయాలి అన్నదాని మీద సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన ఈ దర్శకుడే, ఈ సినిమాకు బడ్జెట్ ను నలభై కోట్లకు చేర్చేసారు. సరే అది వేరే సంగతి. నిర్మాతల మెతకదనం అలా వుంటే ఏ దర్శకుడైనా ఇదే చేస్తారు.
ఇప్పుడు ఏమయిందో కానీ దర్శకుడికి హీరోకి పొసగడం లేదు. దర్శకుడిని కిలోమీటర్ దూరం పెట్టేసాడు. ఎడిటింగ్ కూడా తనే దగ్గర వుండి చూసుకుంటున్నారట హీరో. ఇది ఎంత వరకు వెళ్లిందంటే దర్శకుడు తను ఒకే విమానంలో ప్రయాణించాల్సి వస్తుందని, విదేశంలో పాట షూటింగ్ కు కూడా డైరక్టర్ అవసరం లేదని చెప్పి టీమ్ ను తీసుకుని వెళ్లిపోయాడట సదరు హీరో.
అదీ విషయం.