బాబోయ్ మరీ ఇన్ని మంచి క్వాలిటీస్ నా?

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయింది సాయి పల్లవి. ఇప్పుడు సినిమా జనాలే కాదు, ప్రేక్షకులు కూడా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.  సాయి పల్లవి సంగతులు అంటే తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సాయి…

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయింది సాయి పల్లవి. ఇప్పుడు సినిమా జనాలే కాదు, ప్రేక్షకులు కూడా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.  సాయి పల్లవి సంగతులు అంటే తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సాయి పల్లవి ఫ్యామిలీగా సాయిబాబా అంటే విపరీతమైన భక్తి అంట. అందుకే ఆ పేరు పెట్టారట. టైమ్ దొరికినపుడల్లా పుట్టపర్తి వెళ్లి భజనలు చేస్తుందట. తెల్లవారు ఝామన లేచి గాయత్రి జపం, మెడిటేషన్, యోగా చేయడం మానమన్నా మానదట. 

అడవులు అన్నా పచ్చని ప్రదేశాలన్నా విపరీతమైన ఇష్టమట. నటిగా ఎన్నాళ్లు వుంటామో తెలియదు, తనకంటూ ఓ క్వాలిఫికేషన్ వుండాలని డాక్టర్ చదవిందట. నోట తిట్లు, బూతులు అంటే సమస్యే లేదట. కానీ అలాంటిది బాడోఖోవ్ అని ఫిదాలో అనడానికి చాలా ఫీలయిందట. తన వల్ల ఎవ్వరూ ఇబ్బందిపడకూడదన్నది తన ఫిలాసఫీ అంట. మొటిమలు కవర్ చేసుకోకుండా నటించడం ద్వారా తనలోనూ తన అభిమానులైన అమ్మాయిల్లోనూ ఆత్మ స్థయిర్యం పెరుగుతోందని అంటోంది సాయిపల్లవి. 

ఓర్పుతో పనిచేయడం, సంకల్పం బలంగా వుండడం వంటి వాటి ద్వారా ఏదైనా సాధించవచ్చని తన విశ్వాసం అంట. మొత్తానికి సాయి పల్లవి తన సహజమైన అందంతోనే కాదు, మంచి లక్షణాలతో కూడా మన ప్రేక్షకులను ఆకట్టుకునేలాగే వుంది.