నటుడు రాజశేఖర్ కు హీరోగా పేరు రావడం వెనుక సాయికుమార్ కృషి కూడా వుంది. సాయి కుమార్ హీరోగా, నటుడిగా నిలదొక్కుకోక ముందు రాజశేఖర్ కు గొంతు అరువిచ్చారు. కానీ తరువాత మానేసారు. సరైన హిట్ తగలక, సాయికుమార్ ను రిక్వెస్ట్ చేసి ఓ సినిమాకు మళ్లీ ఆ గొంతును వినిపించారు.
మామూలుగా రాజశేఖర్ మాటలు వింటుంటే భలే కామెడీగా వుంటుంది. తమిళ, తెలుగు, కన్నడ యాసలు కలిసి భలే చిత్రంగా వుంటుంది. ఈ గొంతును ఇప్పటిదాకా సభలు సమావేశాల్లోనే విన్నారు. ఇప్పుడు తొలిసారి సినిమాలో కూడా వినే అవకాశం జీవిత, రాజశేఖర్ కల్పిస్తున్నారు.
Video: Gaddam Gang Theatrical Trailer
వారు అందిస్తున గడ్డం గ్యాంగ్ సినిమాలో రాజశేఖర్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు ట్రయిలర్ చూడగానే తెలుస్తోంది. మరి ట్రయిలర్ కోసం డబ్బింగ్ ట్రయ్ చేసారో, లేక సినిమా మొత్తం అదే కానిచ్చేసారో..అసలే కష్టాల్లో- సరైన సినిమా లేకుండా వున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమంటారా?