బాబు వస్తున్నారా.. బాబోయ్..

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు వస్తున్నారంటేనే అక్కడి కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నయంట. అంటే బాబు గారు వచ్చి, పనులు సూపర్ వైజ్ చేసి, హల్ చల్ చేస్తారని కాదు. Advertisement…

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు వస్తున్నారంటేనే అక్కడి కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నయంట. అంటే బాబు గారు వచ్చి, పనులు సూపర్ వైజ్ చేసి, హల్ చల్ చేస్తారని కాదు.

బాబుగారు నెలకు రెండు సార్లు రావడం వల్ల వాళ్లకు దాదాపు ప్రతి పర్యటనకు 12లక్షలకు పైగా ఖర్చవుతోందట. నెలకు పాతికలక్షలంట. ఎందుకిలా? అంటే.

బాబుగారి పర్యటన వుందీ అంటే పెద్ద సంఖ్యలో పోలీసులను ముందు రోజు మోహరిస్తున్నారట. అలాగే బాబుగారు వచ్చిన నాడు కూడా. ఇక బాబుగారి వెంటే వచ్చే మందీ మార్బలం. అధికార గణం, నాయకులు, కార్యకర్తలు. వీళ్లందరికీ భోజనాలు, ఇంతరత్రా ఏర్పాట్లుచేసే భారం కాంట్రాక్టర్లే చూసుకోవాల్సి వస్తోందని అభిజ్ఞవర్గాల బోగట్టా.

కాఫీలు, టిఫిన్లు, భోజనాలు, వాటర్ బాటిళ్లు, కుర్చీలు, ఇలా ఒకటేమిటి? చాలా ఖర్చులు మీద పడుతున్నాయట. దీనికి అధికారుల వైపు నుంచి రూపాయి ఖర్చుచేయడం లేదట. భారం అంతా కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు పంచుకోవాల్సి వస్తోందట. అదీ సమస్య.