బాహుబలి-2 గుత్తగా అమ్మేస్తారా?

బాహుబలి 2 వ్యాపారంపై అప్పుడే అంచనాలు, వార్తలు, వదంతులు మొదలైపోయాయి. బాహుబలి 2 సగానికి పైగా రెడీ అయిపోయింది. ఇంక మిగిలిన టాకీ పార్ట్ తక్కువే. సిజి, విఎఫ్ఎక్స్ పనులు మాత్రం వుంటాయి. అయితే…

బాహుబలి 2 వ్యాపారంపై అప్పుడే అంచనాలు, వార్తలు, వదంతులు మొదలైపోయాయి. బాహుబలి 2 సగానికి పైగా రెడీ అయిపోయింది. ఇంక మిగిలిన టాకీ పార్ట్ తక్కువే. సిజి, విఎఫ్ఎక్స్ పనులు మాత్రం వుంటాయి. అయితే ఇప్పుడు బాహుబలి 2 మార్కెట్ ప్రారంభమైంది. సహజంగా ఇంతకు ముందు కొన్నవారికే ప్రాధాన్యత వుండొచ్చు. కాకుంటే రేటు కాస్త పెరగచ్చు. 

అయితే ఈ విషయంలో రాజమౌళి అండ్ కో రెండు విధాల ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకటి రేటు పెంచకుండా, ఇప్పటి రేట్లకే అమ్మడం. కానీ ఆ మొత్తం ఇప్పడే ఇచ్చేయాలని కోరడం. దాని వల్ల పెట్టుబడి, వడ్డీ కలిసి వస్తాయి. బయ్యర్లకు రేటు పెరగదు. రెండవ ఐఢియా..గుత్తగా ఈరోస్ వంటి సంస్థకు ఇచ్చేయడం. 

ఇప్పటికే రాజమౌళి అండ్ కో ముందుకు ఒకటి రెండు కార్పొరేట్ ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. దానివైపే వారు ఎక్కువగా మొగ్గతున్నారని వినికిడి. దాని వల్ల టెన్షన్ ఫ్రీగా వుంటుంది. పేమెంట్ పక్కాగా వస్తుంది. మార్కెటింగ్ వాళ్లు చూసుకుంటారు. ఏ సంగతి ఒక నెల తరువాతే ఫైనల్ అవుతుందని తెలుస్తోంది.