బాహుబలి 2 తెలుగు సినిమాల అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. అందులో సందేహం లేదు. అయితే కర్ణాటక థియేట్రికల్ హక్కులు అమ్మలేదు. నిర్మాతలే విడదుల చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే చాలా కాలం క్రితమే నైజాం హక్కులకు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేసింది. 45 కోట్లకు ఆసియన్ సునీల్ బాహుబలి హక్కులు తీసుకున్నారన్నది ఆ వార్త సారాంశం. ట్రేడ్ వర్గాలు నోళ్లు వెళ్ల బెట్టాయి. నలభై అయిదు కోట్లు అంటే వసూళ్లు కనీసం యాభై కోట్ల దాటితే తప్ప, బయ్యర్ గట్టెక్కడం కష్టం అని లెక్కలు కూడా కట్టారు.
అయితే ఇప్పుడు తెలుస్తున్న నిజం ఏమిటంటే, నైజాం థియేటర్ హక్కులు కూడా అమ్మలేదట. అవి కూడా నిర్మాతలే వుంచుకున్నారు. నైజాం డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ దగ్గర 45 కోట్లు అడ్వాన్స్ తీసుకుని, సినిమా పంపిణీకి ఇచ్చారట. మరి ఎంజీ మీద ఇచ్చారో, కేవలం అడ్వాన్స్ కమిషన్ పద్దతి మీద ఇచ్చారో? అమ్మడం మాత్రం జరిగలేదట.
బాహుబలి 2 కి అయిన ఖర్చు అంతా కొన్ని ఏరియాల అమ్మకాలతోనే వచ్చేయడంతో, నైజాం, కర్ణాటక నిర్మాతలు వుంచేసుకున్నారని ఇండస్ట్రీ టాక్. అలా కాదని, ఆ రేటుకు ఎవరూ ఓకె అనకపోవడంతో, నైజాం అడ్వాన్స్ మీద ఇచ్చారని ఇండస్ట్రీ గుసగుస. ఏది నిజమో?