అనుకున్నంతా అయింది. బాహుబలి భారీ లావాదేవీల మీద ఇన్ కమ్ టాక్స్ కన్ను పడింది. జస్ట్ కొద్ది సమయం క్రితం బాహుబలి ఆఫీసు మీద ఇన్ కమ్ టాక్స్ అధికారులు సోదాలకు వచ్చారని వార్తలు వినవచ్చాయి. బాహుబలి ఆఫీసు మీద ఐటి రెయిడ్ జరుగుతోందన్న వార్తలు ఒక్కసారిగా ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి.
బాహుబలి 2 బిజినెస్ ఇటీవల ప్రారంభమైంది. ఆంధ్ర తెలంగాణ ఏరియాలే 150 కోట్ల మేరకు వ్యాపారం సాగించారు. భారీగా అడ్వాన్స్ పేమెంట్లు అందుకున్నారు. వీటిల్లో చాలా వరకు బ్లాక్ పేమెంట్ లే అని వినికిడి. పెద్ద నోట్లు క్యాన్సిల్ కావడంతో బాహుబలి నిర్మాతల దగ్గర భారీగా పెద్ద నోట్లు, కోట్ల మొత్తంలో వుండిపోయాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించడం ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసారన్న వార్తలు నమ్మశక్యంగానే వున్నాయి. కొద్ది సేపు ఆగితే ఈ వార్తలపై క్లారిటీ వస్తుంది.