Advertisement


Home > Movies - Movie Gossip
బాహుబలి తరువాత తొలిసారి?

బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ రేంజ్, స్టామినా, క్రేజ్ ఇంకా ఇంకా ఏ మేరకు పెరిగాయో అందరికీ తెలిసిందే. అలాంటి ప్రభాస్ ఇప్పుడు పబ్లిక్ లోకి వస్తే హంగామా, హడావుడి ఎలా వుంటుంది? ఓ రేంజ్ లో వుంటుంది.

అందుకే ప్రభాస్ ను ఎవరన్నా ఫంక్షన్ కు పిలవాలన్నా కాస్త సందేహం. రావాలన్నా ప్రభాస్ కు కాస్త సంకోచం. కానీ ఇప్పుడు బాహుబలి 2 తరువాత తొలిసారి ఓ ఫంక్షన్ కు రాబోతున్నాడని టాక్.

ఈ నెల 18న విడుదలవుతున్న ఆనందో బ్రహ్మ నిర్మాతలు ప్రభాస్ కు బాగా సన్నిహితులు. అందువల్ల వారి సినిమాకు కలిసి వచ్చేలా భారీగా కాకుండా లిమిటెట్ గాదరింగ్ తో ఓ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోమని చెప్పాడట ప్రభాస్.

ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీడియా, కొద్ది మంది ఇండస్ట్రీ జనాలు, వెరీ ఫ్యూ ఫ్యాన్స్ కు ఈ మీట్ లో చోటు వుంటుంది. ఎప్పుడు ఎక్కడ అన్నది బయటకు చెప్పడం లేదు. ఫ్యాన్స్ హడావుడి సమస్య అవుతుందని జాగ్రత్త పడుతున్నారు.