బాలయ్య ఎమ్మెల్యే, బావగారు చంద్రబాబు సిఎమ్, అల్లుడు లోకేష్ మంత్రి. ఇప్పుడు ఈ పొలిటికల్ ఫ్యామిలీలో చిన్న అల్లుడు కూడా ఎంపీగా రంగప్రవేశం చేస్తారు. కాదూ అంటే ఎమ్మెల్సీ అవుతారు అని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తూ వచ్చింది. అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా పదవులు తీసుకుంటే ఏమంటారో? అన్న కామెంట్లు కూడా వినిపించాయి.
ఇలాంటి నేపథ్యంలో లోకేష్ తన తోడల్లుడు శ్రీభరత్ కు మొండిచేయి చూపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ ఒక అల్లుడిదే పైచేయి. గతంలో చంద్రబాబు ది అప్పర్ హ్యాండ్. దగ్గుబాటిది డౌన్ ట్రెండ్. ఇప్పుడు అదే ట్రెండ్ కొనసౌగుతోందని, శ్రీభరత్ కు టికెట్ ఇవ్వడానికి పెదబాబు, చినబాబు సుముఖంగా లేరని తెలుస్తోంది.
బిసిలను ఆకట్టుకోవాలనే ఐడియాను సాకుగా చూపించి, ఎమ్మెల్సీని విశాఖ జిల్లాలో వేరే వాళ్లకు ఇచ్చారు. ఇప్పుడు అలాగే ఎంపీ సీటును కూడా బిసికి లేదా కాపులకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో వెలమలకు, గవరలకు పెద్దపీట వేసినందున, ఎంపీ సీటు ఇచ్చి కాపులకు కూడా ప్రాముఖ్యత ఇచ్చినట్లు చూపించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అది కుదరని పక్షంలో యాదవ లేదా మరో వెనుక బడిన తరగతుల వారికి విశాఖ ఎంపీ సీటు ఆఫర్ చేస్తారని తెలుస్తోంది. శ్రీభరత్ కు ఎన్నికల అనంతరం చూద్దామని బుజ్జగిస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే బాలయ్యకు బాబుగారు క్లారిటీ ఇచ్చేసారని, శ్రీభరత్ కు విషయం వివరించే బాధ్యత ఆయనపైనే వుంచారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
శ్రీభరత్ కూడా కాదని చేసేదేమీ లేదు. ఎందుకంటే తాత ఎమ్ వివిఎస్ మూర్తి లేరు. మరో తాత తెలుగుదేశం పార్టీతో గట్టి బంధాలతో లేరు. ఇక మిగిలిన లింక్ అల్లా బాలయ్యనే. అందువల్ల ఆయన మాట వినాల్సిందే.
ఐదేళ్లలో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్, పదేళ్లుగా ప్రభుత్వాల మోసాలే!