బాలయ్య చుట్టూ డైరక్టర్లు

డైరక్టర్లు దొరక్క హీరోలు ఇబ్బంది పడుతుంటే, హీరోలు దొరక్క ఇబ్బంది పడే డైరక్టర్లు కూడా వున్నారు. పెద్ద డైరక్టర్లు అంతా ఫుల్ బిజీగా వున్నారు. ప్రస్తుతానికి గౌతమీ పుత్ర శాతకర్ణి పూర్తి చేసి, బాలయ్య…

డైరక్టర్లు దొరక్క హీరోలు ఇబ్బంది పడుతుంటే, హీరోలు దొరక్క ఇబ్బంది పడే డైరక్టర్లు కూడా వున్నారు. పెద్ద డైరక్టర్లు అంతా ఫుల్ బిజీగా వున్నారు. ప్రస్తుతానికి గౌతమీ పుత్ర శాతకర్ణి పూర్తి చేసి, బాలయ్య మాత్రం ఖాళీ వున్నారు. సీనియర్ డైరక్టర్ కృష్ణ వంశీతో సినిమా ఓకె అయింది కానీ, అమితాబ్ సై అనాలి. ఆపై కృష్ణ వంశీ తన నక్షత్రం సినిమా పూర్తి చేయాలి. ఇదిలా వుంటే సీనియర్ డైరక్టర్ చెప్పిన ఓ సబ్జెక్ట్ కూడా బాలయ్యకు నచ్చింది. ఓకె అన్నారు. మరి అదెప్పుడు, ఏం చేస్తారో మరి. 

ఇదిలా వుంటే బాలయ్యకు కథలు చెప్పించి మెప్పించడానికి పలువురు డైరక్టర్లు ప్రయత్నాలు ప్రారంభించేసారు. కేఎస్ రవికుమార్ కలిసి వెళ్లారు. ఎప్పటి నుంచో డైరక్ట్ చాన్స్ కోసం చూస్తున్న ఓ కొత్త డైరక్టర్ కూడా ఓ మాంచి సబ్జెక్ట్ చెప్పారు. నలభై ఏళ్ల మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ ఇది. ఇది కూడా బాలయ్యకు నచ్చింది. లైన్లో పెట్టారు.

గతంలో బాలయ్యతో లయన్ అనే డిజాస్టర్ అందించిన డైరక్టర్ సత్యదేవా కూడా తన దగ్గర వున్న సార్వభౌమ కథను బాలయ్యకు మరోసారి గుర్తుచేసారు. బాలయ్య అందిరికి చెప్పిన మాదిరిగానే చూద్దాం అనేసారు. ఇలా ఎవరికి వారు బాలయ్య చుట్టూ తిరుగుతూ సినిమా చాన్స్ కోసం ప్రయత్నిస్తున్న డైరక్టర్ల జాబితా మెలమెల్లగా పెరిగిపోతోంది.

-సాయి