బ్రహ్మానందం. కొద్ది నెలలు కాదు, ఇంకా వెనక్కి వెళ్తే, కామెడీ కింగ్. ఆయన లేని సినిమా లేదు. ఆయన డిమాండ్ కు తగ్గట్లు ఆయన డిమాండ్లు. అయినా సినిమాలో బ్రహ్మీ వుండాల్సిందే. నవ్వులు పండాల్సిందే. కట్ చేస్తే, కాలం మారిపోయింది. వేల సినిమాల్లో జనాల్ని నవ్వించి, నవ్వించి బ్రహ్మానందం అలసిపోయాడు. బ్రహ్మానందం కోసం క్యారెక్టర్లు రాయగల సత్తా కూడా రచయితల్లో తగ్గిపోయింది. దాంతో ఇఫ్పుడు సినిమాలో బ్రహ్మీ వున్నాడా? అని కాకుండా అవునా.. సినిమాలో బ్రహ్మీ వున్నాడా? అని అడిగే రేంజ్ కు దిగింది పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో బ్రహ్మనందానికి ఓ సినిమా వచ్చింది. అది కూడా సీనియర్ హీరో బాలకృష్ణ సినిమాలో కాస్త లెంగ్త్ ఎక్కువ వున్న రోల్ నే. సి కళ్యాణ్ నిర్మాత. కెఎస్ రవికుమార్ దర్శకుడు. సినిమా షూట్ పూర్తయిపోయిది దాదాపు. కానీ ఇప్పుడు ఆ హ్యాపీనెస్ ఎంతకాలమో మిగిలడం లేదని తెలుస్తోంది.
ఎందుకంటే ఒకటి రెండు రోజుల క్రితం సినిమా రఫ్ చూసిన యూనిట్ కు సినిమా అంతా చాలా బాగా వచ్చిందని, కానీ బ్రహ్మీ కామెడీ ట్రాక్ అంతగా పండలేదని, పైగా కథ, కథనాలకు అడ్డం పడుతోందని ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో అందరూ కలిసి ఆఖరికి బ్రహ్మీ ఎపిసోడ్ కు కోత వేస్తే బెటర్ అన్న ఒపీనియన్ కు వచ్చినట్లు వినికిడి.
ఇప్పుడు ఇక కత్తెర పని ఎడిటర్ చేతిలో పడింది. ఏ మేరకు వుంచుతారో, లేపేస్తారో బ్రహ్మీ ఎపిసోడ్ ను. జై సింహా అని టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇది సంక్రాంతికి విడుదలవుతుంది.