ఆవు వ్యాసం ఒక్కటే దగ్గర వుంటే, ఏ సబ్జెక్ట్ అడిగినా అందులోకి వెళ్లిపోవడం కామన్. దర్శకుడు పూరి జగన్నాధ్ సంగతి అలాగే వుంది. ఏ హీరో దొరుకుతాడా? జనగణమన టైటిల్ ఇచ్చేసి, ఆ సినిమా స్టార్ట్ చేసేద్దామా అని చూస్తున్నారు. సబ్జెక్ట్ ఎలాంటిదో తెలియదు కానీ, టైటిల్ సూపర్. కానీ మహేష్ మాత్రం పూరిని పక్కన పెట్టేసారు. అక్కడి నుంచి ఒక్కో హీరోను పట్టుకుని జనగణమన పాడేస్తున్నారు పూరి జగన్నాధ్ అని ఇండస్ట్రీ గుసగుస.
ఆ మధ్య వెంకీని కలిసి హీరో క్యారెక్టరైజేషన్ ఛెప్పారు. అది ఓకె…కథ చెప్పండి అని అక్కడ రిటార్ట్..మరి ముందుకు బండి నడవలేదని టాక్. మెగాస్టార్ సినిమాకు కూడా అప్పట్లో పాపం ఇదే సమస్య కదా?
లేటెస్ట్ గా బాలయ్య బాబు కు ఈ సబ్జెక్ట్ చెప్పేసినట్లు, ఆయన సరే, చూద్దాం అని చెప్పేసినట్లు తెలుస్తోంది. తన 101 వ సినిమా కోసం బాలయ్యకు మంచి సబ్జెక్ట్ లు అయితే వచ్చాయి కానీ, ఒక్కోదానికి ఒక్కో ఫ్రోబ్లమ్. కృష్ణవంశీ రైతుకు ఓ సమస్య. కృష్ణారెడ్డి చెప్పిన కథ ఓకె కానీ, డైరక్టర్ ఆయనే అయితే కష్టమేమో అన్న అనుమానం.
ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో పూరికి అవకాశం ఇచ్చేద్దాం అన్న డైలామాలోకి బాలయ్య వచ్చినట్లు తెలుస్తోంది. పూరి ఈ డైలామాను కాస్త అటు ఇటు చేస్తే, సినిమా కన్ ఫర్మ్ అయిపోతుంది. చూద్దాం..ఏం జరుగుతుందో?