Advertisement


Home > Movies - Movie Gossip
బాలయ్యను ఢీ కొంటున్న సునీల్

మొత్తానికి సునీల్ ఉంగరాల రాంబాబుకు ఓ డేట్ దొరికింది. ఈ నెల మధ్యలో విడుదల చేద్దామనుకున్నా పనులు పూర్తి కాలేదు. ఇప్పడు దాదాపు ఫైనల్ ఫ్రింట్ రెడీ అయిపోయింది. అన్ని పనులు పూర్తయ్యాయి. అందువల్ల ఇక విడుదలే ఆలస్యం. అందుకే ఓ డేట్ ఫిక్స్ చేసేసుకున్నారు. సెప్టెంబర్ 2న ఉంగరాల రాంబాబు విడుదలవుతుంది.

సెప్టెంబర్ 1న 'సింహ' బాలయ్య పైసా వసూల్ అంటూ సోలోగా వస్తున్నారు. కానీ అంతలోనే, ఆ మర్నాడే సునీల్ గోదాలోకి తన ఉంగరాలు పెట్టుకుని రెడీగా దిగిపోతున్నారు. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్, క్రేజీ డైరక్టర్ పూరి ఒక వైపు, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్, సాప్ట్ డైరక్టర్ క్రాంతి మాధవ్ మరో వైపు అన్నమాట. 

పైసావసూల్ విడుదలయిన మర్నాడు శనివారం అయినా కూడా విడుదల చేయడం విశేషం. సాధారణంగా గురువారం, శుక్రవారం సినిమాలు వస్తుంటాయి. అలాంటిది శుక్రవారం, శనివారం రావడం విశేషమే.