Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సంక్రాంతిపై ఇంకా ఆశలు పెట్టుకున్న బాలయ్య

సంక్రాంతిపై ఇంకా ఆశలు పెట్టుకున్న బాలయ్య

బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో మరో సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ థాయ్ లాండ్ లో నడుస్తోంది. నిజానికి ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది ప్లాన్. కాకపోతే పండక్కి మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు రేసులో ఉండడంతో, డిసెంబర్ కే సినిమాను సిద్ధం చేస్తామని నిర్మాత సి.కల్యాణ్ ఇదివరకే స్పష్టంచేశాడు.

అయితే సినిమాను డిసెంబర్ కు రెడీ చేస్తున్నప్పటికీ బాలయ్య ఆశలు మాత్రం ఇంకా సంక్రాంతిపైనే ఉన్నాయి. కుదిరితే సంక్రాంతికే సినిమాను విడుదల చేయమని ఆయన సి.కల్యాణ్ కు మరోసారి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సి.కల్యాణ్ కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం సినిమాలు నిలిచాయి. వీటిలో బన్నీ చేస్తున్న అల వైకుంఠపురం మూవీ సంక్రాంతికి వచ్చేది కాస్త అనుమానమే అంటున్నారు సినీజనాలు. అందుకే ఈ సినిమా ప్రొగ్రెస్ ను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు సి.కల్యాణ్.

ఒకవేళ బన్నీ సినిమా అనుకున్న టైమ్ కు సిద్ధంకాకపోతే వెంటనే బాలయ్య సినిమాను ఆ స్థానంలో బరిలోకి దింపాలనేది సి.కల్యాణ్ ఆలోచన. బన్నీ సినిమా అనుకున్న టైమ్ కు రెడీ కాదనేది సి.కల్యాణ్ గట్టి నమ్మకం. దీనికి కారణం త్రివిక్రమ్ ట్రాక్ రికార్డు. చెప్పిన టైమ్ కు సినిమాను సిద్ధం చేయలేడు త్రివిక్రమ్.

కాస్త అదనపు సమయం తీసుకుంటాడు. కానీ అల వైకుంఠపురం విషయంలో మాత్రం ఇలాంటి జాప్యం ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం హారిక-హాసిని నిర్మాతల ప్రాజెక్టు కాదు, ఇందులో అల్లు అరవింద్ కూడా భాగస్వామి. సినిమా మేకింగ్ ఆలస్యమైతే అల్లు అరవింద్ ఊరుకునే ప్రసక్తిలేదు. 

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?