టెంపర్ విడుదలకు ముందు బండ్ల గణేష్..గ్రేట్ ఆంధ్రతో మాట్లడుతూ తనను మెగాక్యాంప్ మనిషిగా ముద్ర వేయడానికి ప్రయత్నాలు జరిగాయని, ఒక దశలో టెంపర్ సినిమా నిర్మాణం ఆపేయాలనుకున్నానని అన్నారు. మళ్లీ దానిపై ఇంటర్నల్ గా రగడ జరగడంతో తూఛ్ ..నేనలా అనలేదు అన్నారు. ఎన్టీఆర్ సినిమా విడుదల ముందు ఎందుకు వచ్చిన మెగా వివాదం అనుకున్నారో ఏమిటో?
సరే టెంపర్ విడుదలయింది. హడావుడి పూర్తయింది. ఇప్పుడు బండ్ల ఏకంగా ట్విట్టర్ లోనే మెగా భజన ప్రారంభించారు.
జై చిరంజీవ!! జై చిరంజీవ! చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!!!
ఈ పేటకు ఆయనే మేస్త్రి. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి. ఆయనకి అభిమానం పంచిన తమ్ముళ్ళం మనం. మెగాస్టార్ జిందాబాద్.
boxoffice ni re define చేసిన మెగాస్టార్ చిరంజీవి సైకిల్ స్టాండ్ ఎంప్లాయి నించి నెంబర్ వన్ ప్రొడ్యూసర్ దాక ఎదురుచూసే సినిమా మెగాస్టార్ సినిమా
డాన్సు నేర్చుకోవాలంటే ఫైట్స్ ప్రాక్టిస్ చెయ్యాలంటే నడవాలంటే నిలబడాలంటే చూసే CDs మెగాస్టార్ చిరంజీవిగారివి కాదా.
రాముడు లేని రామాయణమ్ చదవం.చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా ఊసు ఎత్తం.కాలం మారినా గుణం మారని ధ్రువ నక్షత్రం మెగాస్టార్
ఇలా రకరకాల ట్వీట్ లు చేసాడు అర్జెంట్ గా. నిన్నటికి నిన్న సన్నాఫ్ సత్యమూర్తి సినిమ అడియో ఫంక్షన్ లో దర్శకుడు దాసరి, చిరంజీవి ప్రస్తావన లేకుండా ప్రసంగించిన నేపథ్యంలో ఈ ట్వీట్ లు వెలువడినట్లు భావిస్తున్నారు.
మెగాక్యాంప్ మనిషిని అని ముద్ర వేసారు అన్న బండ్ల గణేష్, ఇప్పుడ తనకు తానే మెగా స్టార్ మనిషిని అనే ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దాసరి వ్యవహారాన్ని మరింత పెద్దది చేయాలనే గణేష్ చూస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే కావాలని, అర్జెంట్ గా అన్ని ట్వీట్ లు చేయాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పుడు గణేష్ తన బిజినెస్ ట్రిప్ పై దక్షిణ ఆప్రికాలో వున్నారు. అక్కడి నుంచి అత్యవసరంగా ట్వీట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంటే ఈ వ్వయహారం ఇక్కడితో ఆగకపోవచ్చు.