‘బంగారానికి’ సమస్య ఏమిటి?

కబాలి సినిమా 22న ఫిక్స్ అయింది. దీంతో 29 న రావాలనుకున్న బాబు బంగారం విడుదలపై మల్ల గుల్లాలు మొదలయ్యాయి. అదే రోజు విడుదల అయిపోవచ్చు. సమస్య ఏమీ లేదు. కబాలి ఎంత బాగున్నా…

కబాలి సినిమా 22న ఫిక్స్ అయింది. దీంతో 29 న రావాలనుకున్న బాబు బంగారం విడుదలపై మల్ల గుల్లాలు మొదలయ్యాయి. అదే రోజు విడుదల అయిపోవచ్చు. సమస్య ఏమీ లేదు. కబాలి ఎంత బాగున్నా కూడా వన్ వీక్ తరువాత కాబట్టి సమస్య లేదు. కానీ సునీల్ జక్కన్న 29న వస్తా అని రిక్వెస్ట్ చేస్తున్నారట. 

12న జనతా గ్యారేజ్ పక్కా. మరి అలాంటపుడు ఆ ముందువారం కనుక జక్కన్న వస్తే, 12న లేపేస్తారు. అందుకే 29న వస్తా అంటున్నాడట జక్కన్న. అదే బాబు బంగారం 5న అయినా సమస్య లేదు. ఎందుకంటే అది వెంకీ సినిమా. సురేష్ బ్యాకింగ్ వుంటుంది. పైగా నైజాంలో ఆసియన్ సినిమాస్ వుండనే వుంది. ప్లస్ గీతా ఆర్ట్స్ కు సన్నిహితుడైన మారుతి సినిమా. అన్నింటికి మించి హారిక హాసినికి మాంచి ఫిక్స్ డ్ ప్లస్ బలమైన డిస్ట్రిబ్యూటర్లు వున్నారు. అందువల్ల బాబు బంగారం ను జనతా గ్యారేజ్ వచ్చినా థియేటర్లలోంచి పీకడం కష్టం. 

ఇలాంటి అడ్వాంటేజ్ వున్నా కూడా 29నే రావాలని దర్ళకుడు మారుతి అనుకుంటున్నారు. సరే, ఫైనల్ డెసిషన్ హీరోది కదా? అందుకే నిర్మాత, దర్శకుడు, ఇంకా మరికొంత మంది కలిసి మంగళవారం సాయంత్రం వెంకీతో మీటింగ్ పెట్టారు. అది పూర్తయితే డేట్ తేలుతుంది.