Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బంగార్రాజుకు లైన్ క్లియర్

బంగార్రాజుకు లైన్ క్లియర్

ఎప్పటి నుంచో వార్తల్లో నలుగుతున్న సినిమా బంగార్రాజు. ఒక విధంగా నాగ్ సూపర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్. ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీగా వుంది. అయితే నాగచైతన్య డేట్ లు కావాలి. చైతన్య బయట సినిమాలతో బిజీగా వున్నాడు. వెంకీ మామ ఫినిష్ చేసి, శేఖర్ కమ్ముల సినిమా మీదకు వెళ్తాడు. అది పూర్తయితే తప్ప బంగార్రాజు మీదకు రావడానికి లేదు.

వాస్తవానికి వెంకీ మామ తరువాత బంగార్రాజే చేయాలనుకున్నాడు. కానీ డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరుడు మృతి చెందడంతో, ఆయన తెరుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలని నాగ్ అనుకోవడంతో, చైతూ మరో సినిమాకు ఒకె చెప్పాల్సి వచ్చింది. కానీ వెంకీ మామ కాస్త ఆలస్య అవుతోంది. అందువల్ల అనీ ఆలస్యం అవుతున్నాయి.

ఇదిలావుంటే మన్మధుడు 2 సినిమా ఫెయిల్ కావడంతో, ఇప్పుడు నాగ్ కు మరో ఆప్షన్ ఏదీ రెడీగా లేదు. అందుకే 2020 సమ్మర్ టార్గెట్ గా బంగార్రాజు స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటి నుంచి మెల్లగా స్టార్ట్ చేసి, వచ్చే సమ్మర్ లోగా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ హడావుడి అయిపోగానే బంగార్రాజు స్టార్ట్ చేస్తారు. ఆ తరువాత మెల్లగా చైతూ వచ్చి జాయిన్ అవుతాడు. 

బాహుబలి' ఇంకా కలగానే ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?