బార్‌కి వెళ్ళి మగాళ్ళు గొడవ చేశారంటే ఒక అర్థం వుంది. అలాంటి చోట ఇప్పుడు అమ్మాయిలు తాగి అల్లరి చెయ్యడం కొత్త ట్రెండ్ అయ్యింది. అలాంటి అమ్మాయిల్లో సినిమా హీరోయిన్ వుంటే అది పెద్ద న్యూస్ కాకుండా ఎలా వుంటుంది.? ఇంతకూ అలాంటి న్యూసెన్స్ చేసింది ఎవరనుకుంటున్నారా.? సాక్షాత్తూ సెక్సీ అంజలి అట.
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్‌లో వున్న తబ్లా రెస్టారెంట్ అండ్ బార్‌కి హీరోయిన్ అంజలి, కొంతమంది స్నేహితులతో వచ్చిందనీ, అక్కడ కూల్ డ్రింక్స్ అవీ తాగి ఎంజాయ్ చేస్తున్న టైమ్‌లో ఎవరో అబ్బాయిలు కాస్త ఓవర్ అయ్యారట. దాంతో ఒళ్ళు మండిన అంజలి లేచి వెళ్ళి, అందులో ఒకడ్ని పట్టుకుని లాగి కొట్టడంతో గొడవ ప్రారంభమయ్యిందట.
పోలీసులు వచ్చేలోగా అంజలి అక్కడినుండి వెళ్ళిపోయిందంటున్నారు. అయితే అంజలి మాత్రం అదంతా కరెక్ట్ కాదనీ, ఫేక్ న్యూస్.. అలాంటి బార్ అండ్ రెస్టారెంట్స్‌కి వెళ్ళే అలవాటు నాకు లేదు. ఫ్యామిలీ రెస్టారెంట్స్‌కి ఏదన్నా తినడానికి వెళ్తాను గానీ బార్‌కి వెళ్ళి వెళ్ళి గొడవ చేశాననడం ఇంకా దారుణం. బహుశా నాలా వున్న అమ్మాయి ఎవరో గొడవ చేసి వుంటే నేననుకుని పొరబడి వుండొచ్చు తప్పితే నేను అలాంటి న్యూసెన్స్ చేసే మనిషిని కాదంటుంది అంజలి. నిజానిజాలు ఆ పరమాత్మకే ఎరుక మరి.