Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బెల్లంకొండ.. హీరోయిన్ల మీదున్న శ్రద్ధ కథ మీద పెట్టాలి!

బెల్లంకొండ.. హీరోయిన్ల మీదున్న శ్రద్ధ కథ మీద పెట్టాలి!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. నిర్మాత అయిన తండ్రికి వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు. టాలీవుడ్‌లో దశాబ్దాలుగా సెటిలైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లేక కాదు.. కొన్ని సినిమాలు తీసిన నిర్మాతల తనయులు కూడా హీరోలయిపోవచ్చన్న సందేశాన్ని ఇచ్చాడితను. అయిననూ ఇతడిని ఎవరూ పట్టించుకోరనే భయంతోనే కాబోలు.. భారీగా ఖర్చు చేసి.. భారీ తారాగణాన్ని కూడగట్టుకోవడం మొదలుపెట్టారు.

భారీ పారితోషకం తీసుకునే దర్శకుడు, ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్, కోట్ల రూపాయలు పెట్టి కొనేసి మరో హీరోయిన్‌తో ఐటమ్ సాంగ్ చేయించడం.. ఇలా ప్రతిదాన్నీ డబ్బుతో కొనేసి, డబ్బుతోనే ఈ హీరో తొలి సినిమాపై భారీగా హైప్ పెంచారు. అయితే తీరా ఆ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు!

ఆ ప్రయోగం వికటించినా.. ఈ హీరో రెండో సినిమాకు కూడా సొబగులు తగ్గలేదు! రెండో సినిమా విషయంలో ఉత్సాహవంతుడైన నిర్మాత కమ్ దర్శకుడు.. ఈ హీరో కోసం కథను కూడా తమిళం నుంచి కొనుక్కొచ్చాడు. పేరున్న హీరోయిన్‌తో ఐటమ్ నంబర్ పెట్టించాడు! ఈ సినిమా విషయంలో కూడా కోట్ల రూపాయల చమురు వదిలింది కానీ.. హిట్టు దక్కలేదాయె!

ముచ్చటగా సాయి శ్రీనివాస్ మూడో సినిమా విషయంలో కూడా మళ్లీ పాత ముచ్చట్లే వినిపిస్తాయి. బోయపాటి దర్శకత్వంలో ఇతడు హీరోగా రూపొందే సినిమాలో ఇప్పుడు ఊపు మీదున్న హీరోయిన్‌ను నటింపజేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం పెద్ద హీరోలతో బిజీగా ఉన్న ఆమె అడిగినంత ఇచ్చి మరీ.. సాయి శ్రీనివాస్ పక్కన నటింపేయించాలని చూస్తున్నారట. 

హీరోగా రెండు ఫెయిల్యూర్స్‌తో ఉన్న ఇతడి పక్కన నటించడానికి ఆమె వెనుకాడుతోంది. దీంతో ఆమెను డబ్బుతో కొట్టే యత్నం చేస్తున్నారని టాక్. ఇప్పటికే రెండు సినిమాల విషయంలో ఎదురైన అనుభవాలను పక్కనపెట్టి.. మళ్లీ పెద్ద హీరోయిన్ల మీద ఆధారపడి ఈ హీరో సినిమాపై హైప్ పెంచుకుంటారట! మరి ఇదేం ప్లానింగో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?