రోబో 2.0 సినిమా వస్తోందని తెలిసి కూడా బెల్లంకొండ శీనివాస్ హీరోగా తయారైన కవచం సినిమాను డిసెంబర్ 7 విడుదల డేట్ గా ప్రకటించారు. సరే, రోబో 2.0 సినిమా వచ్చిన తరువాత రిజల్ట్ చూసి, వెనక్కు వెళ్తారేమో అని ఇండస్ట్రీ జనాలు అనుకున్నారు. కానీ రోబో 2.0 సినిమా వచ్చింది. పాజిటివ్ టాక్ వచ్చింది. ఎన్నిరోజులు రన్ వుంటుంది? బిసి సెంటర్లలో ఎలా వుంటుంది? అన్న విషయాలు క్లారిటీ రావాల్సి వుంది.
ఈ క్లారిటీ రాకుండానే, 7న విడుదల పక్కా అని కవచం నిర్మాతలు మళ్లీ అనౌన్స్ మెంట్ ఇచ్చేసారు. అంటే కవచం సినిమా మీద నిర్మాతలకు బాగానే ధీమా, నమ్మకం వున్నట్లు కనిపిస్తోంది. సినిమాను మార్కెట్ చేసారు. మంచి రేట్లకే చేసారు. పైగా సినిమాను బయ్యర్లకు పూర్తిగా చూపించి మరీ అమ్మారు. అందువల్ల ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఇదిలావుంటే అదేరోజు హుషారు, సుబ్రహ్మణ్యపురం, భైరవగీత సినిమాలు షెడ్యూలు అయి వున్నాయి. కానీ వీటిల్లో ఎన్ని వస్తాయి అన్నది అన్నది చూడాలి. భైరవగీత సినిమాకు సెన్సారు సమస్యలు వున్నాయి. 7లోగా సెన్సారు అవుతుందా? అన్నది చూడాలి. హుషారు సినిమా ముందు వెనుక ఆడుతోంది. అందువల్ల బహుశా సుబ్రహ్మణ్యపురం విడుదలయ్యే అవకాశం వుంది.
కవచం సమస్య కూడా వుంది. ఏడున వస్తే రెండువారాలు థియేటర్లలో వుండే అవకాశం వుంది. అలాకాకుండా 14న వస్తే 21న వచ్చే సినిమాల తాకిడికి కొన్ని థియేటర్లు ఖాళీచేయాలి. అందుకే 7న రావాలనే కవచం డిసైడ్ అయిపోయింది.
చంద్ర 'స్క్వేర్' తెలంగాణ గెలుపు చంద్రుడెవరు? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్