Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'బెంగాల్ టైగ‌ర్' హక్కులు గ్లోబ‌ల్ సినిమాస్‌కు

మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్స్ గా, సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న 'బెంగాల్ టైగ‌ర్' చిత్రం హక్కులు గ్లోబల్ మూవీస్ తీసుకుంది. నైజాం లో అత్తారింటికి దారేది , రేసుగుర్రం లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల్ని  గ్లోబ‌ల్ సినిమాస్ నే పంపిణీ చేసింది. ఈ సందర్భంగా నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ"  మా బ్యాన‌ర్ లో మాస్‌మ‌హ‌రాజ్‌ ర‌వితేజ , త‌మ‌న్నా, రాశిఖ‌న్నా లు జంట‌గా  తెరకెక్కిస్తున్న 'బెంగాల్ టైగర్' చిత్రం షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా జరుగుతోంది. బెంగాల్ టైగ‌ర్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు. ఈ చిత్ర‌ంలో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించ‌గా.. కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?