Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

భాజపా దిశగా పివిపి?

భాజపా దిశగా పివిపి?

వ్యాపార వేత్త, నిర్మాత పివిపి కి భాజపా వైపు మోజు వున్నట్లు కనిపిస్తోంది. ఆయనకు ఎప్పటికైనా ఎంపీ కావాలని కోరిక. అది ఆయనే వెల్లడించారు. గతంలో జన సేన తరపున విజయవాడ నుంచి పోటీ చేయాలుకున్నారు కానీ కుదరలేదు. అంతకు ముందు జగన్ తో ఏం తేడా వచ్చిందో కానీ వైకాపా నుంచి పోటీ కూడా లేకపోయింది. కానీ ఆయనలో కోరిక మాత్రం పోలేదు. 

తెలుగుదేశం లో పోటీ ఎక్కువ అందువల్ల అక్కడ సమస్య కూడా ఎక్కువే. అందుకే పివిపి దృష్టి భాజపా వైపు వున్నట్లు కనిపిస్తోంది. పివిపి ఈ విషయం చెప్పకపోయినా, ఆయన సినిమాలను భాజపా నాయకుడు వెంకయ్య నాయుడు పని గట్టకుని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంటే అదే అనిపిస్తోంది. పివిపి కి వెంకయ్య కు మంచి సంబంధాలున్నాయి. అందుకే ఎప్పుడూ లేనిది ఊపిరి, బ్రహ్మోత్సవం సినిమాల మంచి విషయాలను వెంకయ్య పనిగట్టుకు ప్రశంసిస్తూ ప్రకటనలు విడుదల చేసారు.  

ఇక మళ్లీ పివిపి విషయానికి వస్తే ఆయనకు కూడా భాజపా తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. పవన్ దగ్గరకు, బాబు దగ్గరకు వెళ్లరు. వచ్చే ఎన్నికల్లో జగన్ – భాజపా మిత్రులు అయినా, కాకపోయినా, తేదపాతో మాత్రం వుండకపోవచ్చు. అందువల్ల పివిపి కి భాజపా మంచి ఆప్షన్ గా వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?