దిల్ రాజు భలే మనిషి. టాలెంట్ ఎక్కడ వున్నా, సబ్జెక్ట్ బాగున్నా వదలడు. వాళ్ల ట్రాక్ రికార్డుసంగతి అనవసరం. వాసువర్మను ఇలాగే పట్టుకుని, ఇప్పుడు సునీల్ తో కృష్ణాష్టమి సినిమా చేస్తున్నాడు. నిజానికి వాసువర్మ మొదటి సినిమా ఏమంత ఆడలేదు. కానీ కృష్ణాష్టమి సబ్జెక్ట్ ను నమ్మి చాన్సిచ్చాడు దిల్ రాజు.
ఈ సబ్జెక్ట్ అసలు బన్నీ చేయాల్సింది అని వినికిడి. ఇప్పుడు సునీల్ చేస్తున్నాడు. అలాగే లాంగ్ బ్యాక్ వేణు శ్రీరామ్ అని డైరక్టర్ వున్నాడు. సిద్దార్ధ-దిల్ రాజు కాంబినేషన్ లో ఓ మై ప్రెండ్ అని సినిమా చేసాడు. ఇప్పుడు ఆ డైరక్టర్ ను బయటకు తీస్తున్నట్లు టాక్.
రవితేజతో దిల్ రాజుకు ఓ సినిమా కమిట్మెంట్ వుంది. ఆ సినిమాకు ఈ డైరక్టర్ ను వాడతాడని టాక్. మొత్తానికి భలో వోడు దిల్ రాజు. సబ్జెక్ట్,. టాలెంట్ ఎక్కడవుంటే అక్కడ టక్కున పట్టేస్తాడు.