కొరటాల శివ-మహేష్ బాబు-డివివి దానయ్య కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను తొలివారం బాక్సాఫీస్ దగ్గర కాస్త గట్టి వసూళ్లే సాగించింది. మహేష్ కెరీర్ బెస్ట్ అనిపించుకుంది.
తొలివారంలో కొన్ని ఏరియాల్లో మూడు వంతులు పెట్టుబడి వెనక్కు రాబట్టుకుంది. కొన్ని ఏరియాల్లో సగానికి పైగా రాబట్టుకుంది.
ఈ వారంలో సరైన సినిమా ఏదీ బాక్సాఫీస్ దగ్గర లేకపోవడం, ఈసారి కూడా లాంగ్ వీకెండ్ కావడం వంటివి భరత్ అనే నేనుకు కలిసి వచ్చే అంశాలు. అందువల్ల రెండు వారాలకు బ్రేక్ ఈవెన్ అయిపోతుందని ట్రేడ్ వర్గాలు ధీమాగా వున్నాయి.
అయితే రంగస్థలం సినిమాతో పోల్చుకుంటే మాత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్లు కాస్త వెనుకే వున్నాయి.
నైజాం, ఈస్ట్ గోదావరిలో మాత్రం దగ్గరగా రంగస్థలం సినిమాకు దగ్గరగా వచ్చింది. టోటల్ గా భరత్ అనే నేను ఫస్ట్ వీక్ కలెక్షన్లు సినిమాను బ్లాక్ బస్టర్ అని చెప్పకనే చెప్పాయి.
సినిమా థియేటర్ హక్కులు ప్రపంచవ్యాప్తంగా 98కోట్ల మేరకు విక్రయాలు జరిపారు. ఇప్పటికి 75కోట్ల మేరకు రికవరీ వచ్చింది.
భరత్ అనే నేను అమ్మకాలు, ఫస్ట్ వీక్ వసూళ్ల వివరాలు ఇలా వున్నాయి
నైజాం..16.11 (22 Cr)
సీడె. 8 (12 Cr)
ఉత్తరాంధ్ర. 6.6 (8.5 cr)
ఈస్ట్. 5.52 (6.7 Cr)
వెస్ట్.. 3.32 (6 cr)
కృష్ణ – 3.90 Cr
గుంటూరు – 6.8 Cr
(కృష్ణ. గుంటూరు కలిపి సేల్..13.60)
నెల్లూరు…1.95 (3 cr)
కర్ణాటక.roi.. 9.10 (9 cr)
Row – 2.80 Cr
యూఎస్ – 10 Cr