భారతీయుడు 2 ఇంకా డౌటే!

కమల్‌హాసన్‌, శంకర్‌ చేస్తోన్న 'ఇండియన్‌ 2' అలియాస్‌ 'భారతీయుడు 2' చిత్రంపై వినిపిస్తోన్న పుకార్లకి ఇంకా చెక్‌ పడలేదు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి ఓవర్‌ బడ్జెట్‌ అవుతోందనే కారణంతో షూటింగ్‌ నిలిపి…

కమల్‌హాసన్‌, శంకర్‌ చేస్తోన్న 'ఇండియన్‌ 2' అలియాస్‌ 'భారతీయుడు 2' చిత్రంపై వినిపిస్తోన్న పుకార్లకి ఇంకా చెక్‌ పడలేదు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి ఓవర్‌ బడ్జెట్‌ అవుతోందనే కారణంతో షూటింగ్‌ నిలిపి వేయాలని లైకా ప్రొడక్షన్స్‌ నిర్ణయించుకున్నట్టు వదంతులు వస్తే, అందులో నిజం లేదని ప్రకటించారు. షూటింగ్‌ యధావిధిగా జరుగుతోందని ఉటంకించారు.

అయితే కోలీవుడ్‌ న్యూస్‌ రిపోర్ట్స్‌ని బట్టి 'ఇండియన్‌ 2' ముందుకెళుతోన్న తీరు నిర్మాతలకి నచ్చడం లేదని తెలిసింది. ఈ చిత్రానికి తొలి షెడ్యూల్‌ ఎస్టిమేట్‌ రెండున్నర కోట్లు కాగా, ఆరు కోట్లు ఖర్చయిందట. పైగా ఈ షెడ్యూల్‌లో అనుకున్నది మొత్తం కూడా తీయలేకపోయారట. కమల్‌ మేకప్‌కే ఎక్కువ సమయం అవసరం అవుతోందని, అంచేత షూటింగ్‌ సజావుగా జరగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కమల్‌ ఎక్కువ శ్రమ పడాల్సి రావడంతో ఆయన తనకి చెప్పిన పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారట. మొదటి షెడ్యూల్‌కే ఇంత ఓవర్‌ బడ్జెట్‌ అయి, టైమ్‌కి కంప్లీట్‌ కాకపోతే ఇక ఈ చిత్రాన్ని పూర్తి చేసే సరికి చాలా అవుతుందని భావించి దీనిని ముందుకి తీసుకెళ్లాలా లేక ఆపేయాలా అంటూ లైకా సంస్థ చర్చిస్తోందని సమాచారం. 

వంగవీటికే భయపడలేదు.. టీడీపీకి జంకుతానా.. వర్మ ధైర్యం