మహేష్ బాబు నటిస్తున్న 'భరత్ అనే నేను' శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏప్రిల్ 20న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే దీనికి ముందుగా చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు అని అందరు అనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం చిత్ర నిర్మాతలు ఏప్రిల్ 7న ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయ్యడానికి నిర్ణయించారు.
ఈ మేరకు ప్రొడ్యూసర్ డివివి దానయ్య కొద్దీ రోజుల క్రితం మహేష్ బాబుతో చర్చించినట్టుగా తెలిసింది. మహేష్ కూడా ఆ తేదీని ఖరారు చేసుకోమన్నట్టు చిత్ర యూనిట్ నుండి సమాచారం అందింది.
ఈ ఆడియో ఫంక్షన్ కి సంబంధించి కొద్దీ రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేయవచ్చునని తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల జాప్యం జరగవచ్చు అని కొంతమంది ఊహాగానాలు కూడా చేస్తూ ఉండటంతో దానికి సమాధానంగా ఈ చిత్రం ఆడియో ప్రకటన నిర్మాతలు చేయొచ్చు. త్వరలో చిత్ర బృందం ఇంగ్లాండ్ వెళ్లనుంది. అక్కడ కొన్ని పాటలు మరియు కొన్ని సీన్స్ మహేష్ బాబుపై చిత్రీకరించాంనున్నారు.