Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

భారీ బిజినెస్ దిశగా సాహో

భారీ బిజినెస్ దిశగా సాహో

బాహుబలి ప్రభాస్ లేటెస్ట్ భారీ ప్రతిష్టాత్మక సినిమా సాహో. మూడువందల యాభై కోట్లకు పైగా పెట్టుబడితో తయారవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా విడుదల మరో రెండునెలల్లో వుంది. ఈ సినిమాను యువి సంస్థ దాదాపు తన స్వంత రిసోర్స్ తో నిర్మించింది. ఇక మార్కెటింగ్ మీద దృష్టిపెట్టారు యువి నిర్వాహకులు.

వాస్తవానికి చాలా ఏరియాల్లో యువినే పంపిణీ చేస్తుందని, వారికి స్వంత నెట్ వర్క్ వుందని వార్తలు వున్నాయి. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, బాలీవుడ్ ను స్వంతంగా విడుదల చేసుకుంటూ, తెలుగు వెర్షన్ ను మాత్రం వీలయినంతగా మార్కెట్ చేసే ఐడియాలో వున్నారు. ఇప్పటికే కర్ణాటక (27 కోట్లు), ఈస్ట్, వెస్ట్ (20 కోట్లు) ఇచ్చేసారు. అలాగే సీడెడ్ ను 25 కోట్ల రేంజ్ లో విక్రయిస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ కలిపి 20 కోట్ల రేంజ్ లో అమ్మారు అంటే ఆంధ్ర ఏరియా 65 కోట్ల రేషియోలో పడినట్లు అయింది.

ఓవర్ సీస్ ఇదివరకే అమ్మేసారు. నైజాం, వైజాగ్ దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. కృష్ణ, గుంటూరు, నెల్లూరు, తము అనుకున్న రేషియోలో వస్తే ఇచ్చేసే ఆలోచనలో యువి నిర్వాహకులు వున్నట్లు తెలుస్తోంది. ఇండియా వైజ్ గా బాహుబలి పార్ట్ వన్ 150 కోట్లు, బాహుబలి రెండోభాగం 250 కోట్లు వసూళ్లు సాగించాయి. సాహో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 125 కోట్ల వరకు బిజినెస్ టార్గెట్ తో మార్కెట్ చేస్తున్నారు. 

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?