మలయాళీ నటి భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులు చేసిన వ్యవహారం ఇప్పుడు ఆమెకు, ఆ భాష స్టార్ హీరో దిలీప్ కు డైరెక్టు పోరుగా మారుతోంది. భావనపై దాడి విషయంలో దిలీప్ హస్తం ఉందనే ప్రచారం మొదటి నుంచి జరుగుతున్నదే. అయితే కొంతకాలం పాటు ఆ ప్రచారం ఆగింది.
అయితే భావనపై దాడి కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న పల్సర్ సునీ అనే నిందితుడు దిలీప్ కు రాసిన లెటర్ తో ఈ వ్యవహారం మళ్లీ కాక మీదకు వచ్చింది. భావనపై దాడి విషయంలో మీ పేరు చెప్పలేదు కాబట్టి కొంత డబ్బు సహాయం చేయాలని దిలీప్ కు సునీ జైలు నుంచి లేఖ రాశాడు.
ఆ లెటర్ ను పట్టుకుని పోలీసుల వద్దకు వచ్చాడు దిలీప్. తనకు ఆ దాడితో సంబంధమే లేదని, కానీ తనకు సునీ లేఖ రాశాడని. .అతడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఈ లెటర్ ను ఆ హీరోగారు పోలీసులకే తెచ్చి ఇచ్చినప్పటికీ కొత్త అనుమానాలైతే రేగాయి.
ఇక ఇదే సమయంలో దిలీప్ టీవీ చానళ్లతో మాట్లాడుతూ భావనకు కొన్ని ఫ్రీ అడ్వైజ్ లు ఇచ్చాడు. ఆమె స్నేహాలే ఆ దాడికి కారణం అని, కాబట్టి స్నేహాలు చేసే ముందే ఆలోచించుకోవాల్సిందని దిలీప్ చెప్పుకొచ్చాడు. మరి తన పేరును ప్రస్తావించే సరికే భావన స్పందించింది.
దిలీప్ మాటలు తనను బాధించాయని, తనపై అనుచితంగా మాట్లాడితే పోలీస్ కేసు పెడతా అని భావన హెచ్చరించింది. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆ హీరోకి సూచించింది. మొత్తానికి ఈ వ్యవహారం మలయాళీ ఇండస్ట్రీని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. రోజుకు ఒక స్టెప్ ముందుకే వెళ్తోంది.