భయపడుతున్న పండగ సినిమాలు

పండగకు పోటా పోటీగా వస్తున్నాయి నాలుగు సినిమాలు. వేటి సత్తా వాటిది..వేటి కంటెంట్ వాటిది. ఆ విషయంలో ఏ భయం లేదు. కానీ వేరే విషయంలో భయపడాల్సి వస్తోంది. పండగకు విడుదలవుతున్న నాలుగు సినిమాలలో…

పండగకు పోటా పోటీగా వస్తున్నాయి నాలుగు సినిమాలు. వేటి సత్తా వాటిది..వేటి కంటెంట్ వాటిది. ఆ విషయంలో ఏ భయం లేదు. కానీ వేరే విషయంలో భయపడాల్సి వస్తోంది. పండగకు విడుదలవుతున్న నాలుగు సినిమాలలో రెండు సినిమాలకు ఏ సమస్యా లేదు. ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడు చిన్ని నాయనా.. ఈ రెండూ స్వంత విడుదలలే. అందువల్ల వచ్చినా, రాకున్నా వాళ్లదే. 

అయితే నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ సమస్య వేరు. ఈ రెండింటికీ సేల్స్ పూర్తయింది..కమిట్ మెంట్ లు కుదిరిపోయాయి. అడ్వాన్స్ లు కూడా అంతో ఇంతో అందాయి. ఫైనల్ పేమెంట్లు రావాలి. ఇవి సినిమా విడుదలకు ఓ రోజు ముందు వస్తాయి. ఇక్కడే వుంది అసలు సమస్య.

మామూలుగానే సినిమా విడుదల ముందు రోజు డబ్బులు కట్టేటప్పుడు బయ్యర్లు చిలక్కొట్టుడు కొడతారు. అడ్జస్ట్ కాలేదు..సరిపడా థియేటర్లు దొరకలేదు. అడ్వాన్స్ లు రాలేదు..లేదా ఏ మాత్రం నెగిటివ్ టాక్ వినిపించినా అది సాకు చూపించడం.. మామూలే. పది, ఇరవై లక్షలు తగ్గించి కట్టడం చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు నాలుగు సినిమాల నడుమ టఫ్ కాంపిటీషన్ లో సినిమాలు విడుదల అవుతుంటే, బయ్యర్లు సాకులు వెదుక్కోవాల్సిన పనేముంటుంది? 

సోలోగా వస్తారనుకున్నాం..వన్ వీక్ గ్యాప్ వుంటుందనుకున్నాం..ఇప్పుడు సరిపడా స్క్రీన్ లు లేవు, కలెక్షన్లు డివైడ్ అయిపోతాయి..ఇలాంటి మాటలు వినిపించడానికి బయ్యర్లు రెడీ అయిపోతున్నారని వినికిడి. దీంతో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ సినిమాల సేల్స్ టార్గెట్ కు కన్నం పడే ప్రమాదం వుంది. కావాలంటే ఓవర్ ఫ్లోస్ లో చూసుకుందాం అంటారు..అది ఇక అంతే సంగతులు. 

మరి ఈ సమస్య నుంచి ఆయా సినిమాల నిర్మాతలు ఎలా గట్టెక్కుతారో? చూడాలి.