భీష్మ… ఎప్పటికి రెడీ?

చకచకా ఛలో సినిమా తీసి హిట్ కొట్టాడు దర్శకుడు వెంకీ కుడుముల. చాలా తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. తను కూడా జస్ట్ శాలరీకే సినిమా చేసాడు. మంచి అప్లాజ్…

చకచకా ఛలో సినిమా తీసి హిట్ కొట్టాడు దర్శకుడు వెంకీ కుడుముల. చాలా తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. తను కూడా జస్ట్ శాలరీకే సినిమా చేసాడు. మంచి అప్లాజ్ వచ్చింది. నితిన్ తో సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో భీష్మ సినిమా వచ్చింది. అంతవరకు బాగానే వుంది.

కానీ అక్కడ నుంచే వ్యవహారం నత్తనడక నడుస్తోంది. నిజానికి నితిన్ చేతిలో పారలల్ సినిమా ఏదీలేదు. డైరక్టర్ వెంకీ పరిస్థితి అదే. అసలు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నే చాలాకాలం పట్టింది. సెకండాఫ్ స్క్రిప్ ఎంతకూ రెడీ కాలేదు. అంతా రెడీ అయి, సెట్ మీదకు వెళ్లింది కానీ వర్క్ చూస్తుంటే అంత స్పీడ్ గా నడుస్తున్నట్లు కనిపించడం లేదు.

భీష్మ సినిమా ఇప్పటికి గట్టిగా 40శాతం మించి పూర్తికాలేదని బోగట్టా. ఈ సినిమా తరువాత స్టార్ట్ అయిన అనేక సినిమాలు చకచకా ఫినిష్ అవుతున్నాయి. సమస్య ఎక్కడుందో మేకర్లకే తెలియాలి. ఇదిలావుంటే తొలి సినిమా ఛలో స్మాల్ బడ్జెట్ లో తీసి, మంచి అవుట్ పుట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుమల భీష్మ సినిమాకు మాత్రం కాస్త గీత దాటుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాకు నాన్ థియేటర్ రైట్స్ రూపంలో మంచి మొత్తం వచ్చింది. దాదాపు 16 కోట్ల రూపాయలు ఇలా వచ్చింది. ఆ బడ్జెట్ లో సినిమా పూర్తి అయితే నిర్మాతకు కాస్త లాభం వస్తుంది. ఎందుకంటే నితిన్ కు కావచ్చు, మీడియం సినిమాలకు కావచ్చు థియేటర్ రైట్స్ అంత గొప్పగా రావడంలేదు. అందువల్ల బడ్జెట్ కంట్రోలు చూసుకోవడం అవసరం.

కానీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ విషయంలో వెంకీ కుడుమలకు పరిమితులు పెట్టడంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు బోగట్టా. ఇలా చేసుకునే శర్వానంద్ రణరంగం సినిమాకు ఓవర్ బడ్జెట్ చేసుకున్నారు. మరి భీష్మ సంగతి ఏమవుతుందో?

'బాహుబలి' ఇంకా కలగానే ఉంది