cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఫంక్షన్ డవుట్? ట్రయిలర్ వస్తోంది

 ఫంక్షన్ డవుట్? ట్రయిలర్ వస్తోంది

ఈనెల 16న తిరుపతిలో ఎన్టీఆర్ బయోపిక్ అడియో ఫంక్షన్ భారీగా జరుగుతుందని వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్ ను కాస్త అబేయన్స్ లో వుంచారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ 11న వుంది. కూటమి పవర్ లోకి వస్తే, ఆ హడావుడి, మంత్రివర్గం ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి. అందులో అందరూ బిజీగా వుంటారు.

లేదూ హంగ్ వస్తే, ఎమ్మెల్యేలు, జంపింగ్ జపాంగ్ లు ఇలాంటి గడబిడ అంతా వుంటుంది. అందువల్ల బాలయ్య ఫుల్ బిజీగా వుంటారు 11 నుంచి కనీసం నాలుగు రోజులు. అందువల్ల 16న ఫంక్షన్ చేయడమా, కొద్దిరోజులు వెనక్కు నెట్టడమా అన్న ఆలోచనలు సాగుతున్నాయి.

ఏ విషయం 11 న డిసైడ్ చేద్దామని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. 11న రిజల్ట్, ఇతరత్రా వ్యవహారాలను బట్టి ఫంక్షన్ డేట్ వుంటుంది. ప్రస్తుతానికి 21 వ తేదీని ఆల్టర్ నేట్ డేట్ గా ఫిక్స్ చేసి వుంచుకున్నారు.  ఇదిలా వుంటే ముందుగా అనుకున్న 16వతేదీకి ట్రయిలర్ విడుదల చేస్తారు

ఈ లోగా మహానాయకుడులోని టైటిల్ సాంగ్ ను విడుదల చేస్తారు.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్