మహానటి సినిమా కాదు కానీ, మొత్తం ఎన్టీఆర్ బయోపిక్ నే మార్చేసింది. ఎన్టీఆర్ బయోపిక్ లో దాదాపు 60 గెటప్ లు వేయాలని, ఏదేదో చేయాలని అనుకున్నారు బాలయ్య. కానీ ఇప్పుడు మహానటి తరువాత ఓ సినిమా సెలబ్రిటీ బయోపిక్ అంటే ఎలా వుంటుందో అర్థం అయింది. రంగంలోకి దర్శకుడు క్రిష్ వచ్చి మొత్తం మార్చేసారు.
ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ టార్గెట్ ఫ్యామిలీస్ అంట. ఎన్టీఆర్ ను అభిమానించిన మునపటి రెండుతరాలు ఇళ్ల నుంచి థియేటర్ కు వచ్చి సినిమాను చూడాలనే కాన్సెప్ట్ తో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసారు. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు.
బిఎ సుబ్బారావుగా నరేష్
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ బయోపిక్ లో నిర్మాత బిఎ సుబ్బారావుగా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్-ఎఎన్నార్ లు నటించిన పల్లెటూరి పిల్ల సినిమా నిర్మాత ఆయనే. ఎన్టీఆర్ కు ఇది మూడో సినిమా. మనదేశం, షావుకారు తరువాత ఈ సినిమా చేసారు. అందుకే బయోపిక్ లో ఆ సీన్లు పెట్టారు. ప్రస్తుతం అన్నపూర్ణలో బిఎ సుబ్బారావుతో ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లు నరేష్-బాలయ్యలపై తీస్తున్నారు. దీంతో యంగ్ ఎన్టీఆర్ గా కూడా బాలయ్యే కనిపిస్తారని క్లారిటీ వచ్చేసింది.