ఎప్పటి నుంచి లాక్ అయిపోయి వున్నాడో కదా..దర్శకుడు రవీంద్ర(బాబి). అతి కష్టం మీద సెట్ మీదకు వెళ్లింది గబ్బర్ సింగ్ 2. ఏదో చేసాం అన్నట్లుగా రెండు చిన్న షెడ్యళ్లు చేసారు. ఈ లోగా హీరోయిన్ మారింది. టైటిల్ సర్దార్ గబ్బర్ సింగ్ అయింది. ఇంతలోనే హీరో విదేశాలకు వెళ్లిపోయారు.
ఆయన ఫస్ట్ వీక్ లో రావాలి. మళ్లీ షూటింగ్ కొనసాగాలి. ఈలోగా పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు టీజర్ విడుదల చేస్తున్నారు. దీనికే సినిమా విడుదల అన్నంతగా ఎగ్జయిట్ అయిపోతున్నాడు బాబి. దేవీ సూపర్ ఆర్ ఆర్ ఇచ్చాడు..చాలా ఎగ్జయింటింగ్ వుంది అంటూ ట్వీట్ చేసాడు.
మరోపక్క శరద్ మురార్ ఏమో, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టీజర్స్ విడుదల చేస్తాం ఈ రోజు అంటున్నాడు. అంటే ఇంకా మరి కొన్ని టీజర్లు లైన్లోవున్నాయన్న మాట. మరి అసలు సినిమా ఎప్పుడొస్తుందో? అభిమానులను ఎప్పుడు అలరిస్తుందో?