బోమన్ ఇరానీ…అత్తారింటికిదారేది సినిమాతో తెలుగువాళ్లకు పరిచయం అయిన మంచి నటుడు. ఆయన సాధారణంగా కాస్త విషయం లేని సినిమాలు ఓకె చేయడు. అలాంటిది ఏ కళ నున్నాడో బెంగాల్ టైగర్ ఓకె చేసాడు. అందులో హీరోతో కాంబినేషన్ సీన్లు బోలెడు వున్నాయి. ఈ కాంబినేషన్ కోసం బోమన్ డేట్లు ఇచ్చాడు. ఆ డేట్లు వాడుకోకుంటే బోమన్ మళ్లీ దొరకడం కష్టం అవుతుంది. అయితే ఇది నేపథ్యం.
ఇక అసలు విషయం ఏమిటంటే..రవితేజను ఓ ఓవర్ సీస్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా పిలిచారట. దానికి గాను వాళ్లు కోటో, అరకోటో క్యాష్ అవార్డు కూడా ఆఫర్ చేసారట. బాగానే వుంది. కానీ ఆ ఫంక్షన్ డేట్లు, బోమన్ ఇరానీ కాంబినేషన్ డేట్లు క్లాష్ అయ్యాయట. తనకు ఫంక్షన్, క్యాష్ అవార్డు కన్నా, సినిమా కీలకం అని రవితేజ ఆ ఇన్విటేషన్ కు నో అన్నాడట. పాపం, బోమన్ డేట్ల వల్ల రవితేజకు అరకోటి లాస్ అన్నమాట.