మెగాస్టార్ 150వ సినిమాకు కత్తిలాంటి టైటిల్ ఫిక్స్ చేసాడు దర్శకుడు వినాయక్. కత్తిలాంటోడు అంటూ. కానీ దాన్ని చిరు అండ్ చరణ్ కలిసి ఖైదీ నెం 150 అని మార్చారు. ఓకె. అది చాల బాస్ ఈజ్ బ్యాక్ అంటూ టాగ్ లైన్ పెట్టారు. అభిమానులకు ఈ టైటిల్ నచ్చలేదు. ఆ టాగ్ లైన్ అస్సలు నచ్చలేదని వార్తలు గుప్పుమన్నాయి.
ఆఖరికి అభిమానులు అంతా వాట్సప్ గ్రూప్ ల్లో దీన్ని ఓ డిస్కషన్ పాయింట్ గా మార్చారని వినికిడి. అది కాస్తా రామ్ చరణ్ దృష్టికి ఆయన దగ్గర వుండేవారు తీసుకెళ్లారట. కనీసం బాస్ ఈజ్ బ్యాక్ అన్న టాగ్ లైన్ అన్నా తీసేయండి. ఏదో బస్సుల వెనకాల, లారీల వెనకాల బోస్ ఈజ్ బాస్ అని రాసిన టైపులో వుంది అంటూ.
కానీ దానికి రామ్ చరణ్ నో అని అనేసారని తెలుస్తోంది. '..వాళ్లు అలాగే అంటారు. లీవ్ ఇట్.. డాడీ నేను కలిసి ఫిక్స్ చేసాం. వన్స్ ఫైనల్ ఈజ్ ఫైనల్ ..' అని అనేసాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీంతో ఇక చేసేది లేక ఫ్యాన్స్ సైలంట్ అయ్యారట.
ఇదిలా వుంటే బన్నీ టైటిల్ డిజె కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ కూడ ఈ డిజె అన్న టైటిల్ వుంచి, దువ్వాడ జగన్నాధం అన్న టాగ్ లైన్ వద్దు అన్న సూచనలు వినిపించడం ప్రారంభమైంది. ఇదేదో కోన వెంకట్ తన సినిమాల్లో బ్రహ్మానందానికి పెట్టిన పేరులా వుందని అంటున్నారట. మరి బన్నీ ఏమంటాడో?