బోయపాటి సినిమాకు ఫ్యామిలీ టైటిల్

బోయపాటి శ్రీనివాస్ సినిమా అంటే యాక్షన్ హై ఓల్టేజ్ లో వుంటుంది. ఎమోషన్లు పీక్ లో వుంటాయి. అందుకే ఆయన ఇటీవలి సినిమాల టైటిళ్లు సింహా, లెజెండ్, దమ్ము, సరైనోడు అంటూ మాస్ అప్పీల్…

బోయపాటి శ్రీనివాస్ సినిమా అంటే యాక్షన్ హై ఓల్టేజ్ లో వుంటుంది. ఎమోషన్లు పీక్ లో వుంటాయి. అందుకే ఆయన ఇటీవలి సినిమాల టైటిళ్లు సింహా, లెజెండ్, దమ్ము, సరైనోడు అంటూ మాస్ అప్పీల్ తో వుంటున్నాయి. అయితే ప్రస్తుతం బోయపాటి చేస్తున్న సినిమాకు మాత్రం పక్కా ఫ్యామిలీ టైటిల్ పెట్టబోతున్నారట.

ప్రస్తుతం బోయపాటి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా జరుగుతోంది. ఆల్ మోస్ట్ ఫైనల్ కు చేరుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ సినిమాకు మాత్రం పక్కా ఫ్యామిలీ టైటిల్ పెట్టాలని బోయపాటి చూస్తున్నారు. అందుకోసం సరైన టైటిల్ కావాలని అన్వేషిస్తున్నారట. టైటిల్ చాలా స్మూత్ గా, ఫ్యామిలీలకు పట్టేలా వుండాలని, వెదుకుతున్నారట. ఈ మధ్య ఇలాంటి టైటిళ్లకే గిరాకీ పెరుగుతున్నట్లుంది. ఇప్పటికే శర్వా శతమానం భవతి వచ్చేసింది. నాగచైతన్య ఓ టైటిల్ తో వస్తున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం అని. ఎవరైనా బోయపాటికి మంచి టైటిల్ సూచించవచ్చు, బట్ కండిషన్ ఒకటే ఫ్యామిలీ టైటిల్ కావాలి.