‘దేశం’ సేవలో బోయపాటి

దర్శకుడు బోయపాటి ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నారు. అయితే బాలయ్య బాబుతో చేయబోయే సినిమా వర్క్ లో కాదు. తెలుగుదేశం పార్టీ కోసం రూపొందించే ఎన్నికల ప్రకటనల పనిలో. ప్రస్తుతం బోయపాటి విజయవాడలో క్యాంప్…

దర్శకుడు బోయపాటి ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నారు. అయితే బాలయ్య బాబుతో చేయబోయే సినిమా వర్క్ లో కాదు. తెలుగుదేశం పార్టీ కోసం రూపొందించే ఎన్నికల ప్రకటనల పనిలో. ప్రస్తుతం బోయపాటి విజయవాడలో క్యాంప్ వేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన చంద్రబాబు మీడియా టీమ్ తో కలిసి, ఎన్నికల ప్రకటనలు, ప్రచారం ప్లాన్ లు  రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో దర్వకుడు రాఘవేంద్రరావు, నటుడు, దర్ళకుడు రవిబాబు కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం, ప్రకటనలు వంటి వ్యవహారాలకు సాయంపట్టారు. బోయపాటి గతంలో గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంగా బ్యూటిఫికేషన్, సినిమాటిక్ సెట్టింగ్ లు, లైటింగ్ ల ఏర్పాటు, గోదావరి హారతి సెట్టింగ్ లు వంటి వాటికి తన సలహా సహకారాలు అందించారు.

అప్పుడె గోదావరి పుష్కరాల తొక్కిసలాట, పలువురి మరణం సంభవించాయి. దీనికి బోయపాటి డాక్యుమెంటరీ చిత్రీకరణ కూడా కొంత కారణం అని విమర్శలు, ఆరోపణలు వున్నాయి. ఆ సంగతి అలావుంచితే, ఇప్పుడు బోయపాటి ఎన్నికల ప్రకటనలకు సేవలు అందిస్తున్నారన్న మాట. ఏమైనా సినిమా జనాల్ని వాడాలంటే తెలుగుదేశం పార్టీదే పైచేయి.

షాలిని పాండేని 'అలంకారం'గా మాత్రమే వాడుకున్నారా?

కళ్యాణ్ రామ్ చెప్పినట్లే సినిమా ఉందా?