మొత్తానికి రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ సినిమాకు శ్రీకారం చుట్టేసారు. ఈ రోజు ఎర్లీ హవర్స్ లో బోయపాటి తన సెంటిమెంట్లు అన్నీ పాటిస్తూ సినిమాను స్టార్ట్ చేసేసారు. సినిమా ప్రారంభంలో వచ్చే స్టార్ట్ కెమేరా యాక్షన్ అనే సీన్ షూట్ చేసేసారు. ఆ తరువాత రామోజీ ఫిలిం సిటీకి షూటింగ్ స్పాట్ ను షిప్ట్ చేసారు.
వాస్తవానికి ఈ సినిమా కోసం హీరో రామ్ చరణ్ ఇంకా రెడీ కాలేదు. ఆయన రాజమండ్రి దగ్గర రెండు పాటల చిత్రీకరణ కోసం బయల్దేరి వెళ్లారు. అయితే ఈ సినిమాను ఎలాగైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని ముందు నుంచీ పట్టుదలగా వున్న, బోయపాటి అనుకున్నట్లుగానే మొదలు పెట్టేసారు.
రామ్ చరణ్ షూటింగ్ కు రావడానికి ఇంకా కనీసం రెండువారాలు పైనే పట్టే అవకాశం వుంది. ఎందుకంటే రెండు పాటల చిత్రీకరణ పూర్తికావాలి. ఆ తరవాత రంగస్థలం డబ్బింగ్, ప్రమోషన్ తదితర కార్యక్రమాలు వుంటాయి. వీటి మధ్యలో ఏమన్నా అడ్జస్ట్ చేసుకుంటే బోయపాటి సెట్ మీదకు రావచ్చు. లేదూ అంటే కొన్నిసీన్లు లాంఛనంగా తీసి, బ్రేక్ ఇచ్చి, రంగస్థలం తరువాత సెట్ మీదకు వెళ్తారేమో?