బోయపాటి పంతమే పంతం

మూడు రోజులు, ముఫై మూడు మీటింగ్ లు. కానీ దర్శకుడు బోయపాటి ఒకటే మాట. 11వ తేదీ విడుదల. ప్రసాద్ ల్యాబ్ వేదికగా మూడు వంతుల మీటింగ్ లు, బోయపాటి ఆఫీస్ లో మరి…

మూడు రోజులు, ముఫై మూడు మీటింగ్ లు. కానీ దర్శకుడు బోయపాటి ఒకటే మాట. 11వ తేదీ విడుదల. ప్రసాద్ ల్యాబ్ వేదికగా మూడు వంతుల మీటింగ్ లు, బోయపాటి ఆఫీస్ లో మరి కొన్ని. ఎన్ని మీటింగ్ లు అయినా, ఎంత వత్తిడి వచ్చినా ఆయన మాట ఒకటే 11వ తేదీ అని ముందుగా అనుకున్నాం. అదే తేదీకి విడుదల చేద్దాం. కానీ ఆయన పైకి బహిరంగంగా వెల్లడించని విషయం ఒకటి వుంది.

వాస్తవానికి ఈ సినిమా గత నెలలో రావాల్సి వుంది. కానీ దిల్ రాజు ఫిదా సినిమాను ప్లాన్ చేసుకున్నారు. జయ జానకి నాయక సినిమాకు కూడా దిల్ రాజే డిస్ట్రిబ్యూటర్. అందువల్ల నిర్మాతలు కావాలని తమ సినిమాను వెనక్కు తెచ్చుకున్నారు. అలా తెచ్చుకుంటే, మైనస్ అవుతుందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్లో చేయమని వాళ్లే దర్శకుడు బోయపాటిని కోరారు. దాంతో ఆయన తల వంచారు. లేదూ అంటే ఈ సినిమా అప్పుడే విడుదలకు రెడీ. 

ఒకసారి అలా తల వంచానని, మళ్లీ మళ్లీ అంటే తన వల్ల కాదని బోయపాటి ఈ సారి కరాఖండీగా చెప్పేసారు. వాస్తవానికి ముందు రెండు రోజులు సినిమాను ఓ రోజు ముందుగా విడుదల చేయడంపై మీటింగ్ లు నడిచాయి. దానికి బోయపాటి ఓకె అనలేదు. 10న రావాలి అనుకుంటే, 1వ తేదీ నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేయాలన్నది ఆయన ఆలోచన. అలా జరగలేదు కాబట్టి వద్దని చెప్పేసారు.

ఉన్నట్లుండి బయ్యర్ల వైపు నుంచి వత్తిడి ప్రారంభమైంది. అనుకున్న రేంజ్ లో డబ్బులు కట్టలేమని, మూడు సినిమాలు వస్తాయని తాము అనుకోలేదని వాళ్లు అడ్డం పడడం ప్రారంభమైంది. దీంతో మంగళవారం ఉదయం నుంచి కొత్త మంతనాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం వరకు ఇవి సాగుతూనే వున్నాయి. ఇంతలో వున్నట్లుండి బోయపాటి వీటికి ముగింపు పలకాలని డిసైడ్ అయ్యారు. 11న విడుదల కన్ఫర్మ్ చేస్తూ మేసేజ్ పంపేయమని తన యూనిట్ ను ఆయనే ఆదేశించేసారు. 

మరో పక్క డబ్బులు కట్టలేమన్న బయ్యర్లకు నిర్మాత రవీందర్ రెడ్డి ఝలక్ ఇచ్చారని వినికిడి. అవసరం అయితే తానే నేరుగా విడుదల చేసుకుంటానని అన్నారు. దీంతో మొత్తానికి వ్యవహారం కొలిక్కి వచ్చింది. 11న ముప్పేట పోరు ఫిక్సయింది. ఇంకోపక్క జయజానకీనాయక వాయిదా పడుతుందని మిగిలిన రెండు సినిమాల నిర్మాతలు ఉత్కంఠతో ఎదురు చూసారు. ఒక్క సినిమా వాయిదా పడితే చాలు, బిజినెస్ సమస్యలు ఒడ్డెక్కేస్తాయనుకున్నారు. కానీ వాళ్ల ఆశలు కూడా నెరవేరలేదు.