బన్నీ ఆలోచనలో ఆ సినిమా

బన్నీ అనగానే.. ఇదిగో సినిమా, అదిగో సినిమా అన్నట్లున్న వ్యవహారం గుర్తుకు వస్తుంది. ఒకపక్కన డైరక్టర్ త్రివిక్రమ్ తో సినిమా ఓకె చేసారు. కథ వంటకం మొదలైంది. అయితే జనవరి వరకు తనను కథ…

బన్నీ అనగానే.. ఇదిగో సినిమా, అదిగో సినిమా అన్నట్లున్న వ్యవహారం గుర్తుకు వస్తుంది. ఒకపక్కన డైరక్టర్ త్రివిక్రమ్ తో సినిమా ఓకె చేసారు. కథ వంటకం మొదలైంది. అయితే జనవరి వరకు తనను కథ మీద వదిలేయాలని ఇప్పటికే త్రివిక్రమ్ మాట తీసుకున్నాడు.

జనవరి వరకు అంటే కాస్త అటే అవుతుంది కానీ, ఇటు మాత్రం కాదు. అంటే ఇలా.. అలా అని సినిమా మొదలయ్యే సరికి ఫిబ్రవరి వచ్చెయవచ్చు. అందుకే గీతా సంస్థ తమ అనుబంధ బ్యానర్ పై నితిన్ సినిమాను జనవరి నుంచి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటోంది.

ఇదంతా ఇలా వుంటే, కాస్త గ్యాప్ దొరికితే, ఓ చిన్న ఎక్స్ పెర్ మెంట్ చేసే ఆలోచనలో బన్నీ వున్నట్లు ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది. తమిళంలో ఇటీవల పెద్ద హిట్ అయిన 96 సినిమా హక్కులను నిర్మాత దిల్ రాజు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను ఆరంభంలోనే బన్నీ చూసాడు. నటనకు మంచి అవకాశం వున్న ఈ సినిమాను చేసేస్తే ఎలా వుంటుందీ అన్న ఆలోచనలో బన్నీ వున్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమా రూపొందించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ కు దిల్ రాజు తెలుగు వెర్షన్ బాధ్యతలు అప్పగించారు. తెలుగు స్క్రిప్ట్ తయారీ చకచకా జరిగిపోతోంది.

కంటిన్యూగా రెండు మూడు నెలలు వర్క్ చేస్తే సరిపోతుందని లెక్క వేస్తున్నారు. అందులో హీరో డేట్ లు గట్టిగా నెలరోజులు ఇస్తే చాలు. అందుకే త్రివిక్రమ్ సినిమా లోపు యాక్టింగ్ కు అవకాశం వున్న ఈ సినిమా చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన బన్నీ చేస్తున్నట్లు వినిపిస్తోంది.

సమంత (తమిళంలో త్రిష) హీరోయిన్ అయితే బాగుంటుందన్న డిస్కషన్ కూడా దిల్ రాజు-బన్నీల మధ్య వచ్చినట్లు తెలుస్తోంది. త్రిషనే తెలుగులో కూడా చేయిద్దామని దర్శకుడు అంటున్నట్లు వినికిడి. మొత్తానికి ఆ విధంగా 96 సినిమా డిస్కషన్లు షురూ అయ్యాయి. బన్నీ ఓ డెసిషన్ కు వచ్చేస్తే, ఓ డిఫరెంట్ సినిమా తెరమీదకు వస్తుంది.

కులం చెడ్డా సుఖం దక్కుతోందా! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్